NTV Telugu Site icon

Lady Shaving: నిజమైన బ్రాహ్మంగారి కాలజ్ఞానం.. సెలూన్ లో అమ్మాయిలు షేవింగ్..!

New Project (13)

New Project (13)

Lady Shaving: పొట్టివాడు దేశాన్ని ఏల‌తాడు. పంది కడుపున కోతి పుడుతుంది. రెక్కలు వచ్చిన కోడి పిల్ల మనిషి భాషలో మాట్లాడుతుందంటూ చెప్పినప్పుడు వింతగా అనిపించాయి. కానీ అవే ఇప్పుడు నిజమవుతున్నాయి.. వీటన్నింటినీ ముందుగానే ఊహించి బ్రహ్మంగారు కాలజ్ఞానం రచించారు. గతంలో చెప్పిన విషయాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంటే అవన్నీ నిజమే అనిపిస్తోంది. ఇప్పుడు కూడా ఇదే తరహాలో ఓ వింత సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఏంటది అని ఆశ్చర్యపోవడమే కాదు.. అదిచూస్తే మీరంతా నోరెళ్లబెడతారు. ఇప్పటి వరకు మగాళ్లకు గడ్డం వస్తే సెలూన్ కెళ్లి షేవింగ్ చేయించుకోవడం అందరికీ తెలిసిన విషయం. కానీ ప్రకృతికి విరుద్ధంగా ఓ అమ్మాయి సెలూన్ లో తన ముఖానికి షేవింగ్ చేయించుకుంటూ కనిపించింది. ఆ విషయాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. దీంతో ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది. 15 సెకన్లు ఉన్న ఈ వీడియోలో ఓ అమ్మాయి రెడ్ డ్రస్ వేసుకుని షేవింగ్ చేయించుకుంటూ కనిపించింది. తనకు షేవింగ్ చేసే వ్యక్తి ఆ అమ్మాయి ముఖంపై షేవింగ్ క్రీమ్ రాసి మగవాళ్లకు షేవ్‌ చేసే బ్లెడ్ తోనే షేవింగ్ చేస్తున్నాడు.

అది చూసిన వారంతా ఒక్క సారిగా ఖంగుతింటున్నారు. ఈ వీడియోని షేర్ చేస్తూ సదరు అకౌంట్ దారు మార్పు అనేది ప్రకృతి ధర్మం అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెట్టిజన్స్ క్రేజీగా కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కూడా టిక్ టాక్ లో ఇలాంటి వీడియో ఒకటి వైరల్ అయింది. ఓ మహిళ తన ముఖాన్ని ఎప్పటికప్పుడు షేవ్ చేసుకున్నట్లు వెల్లడించింది. అలా ముఖానికి షేవింగ్ చేసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుందని చ‌ర్మంపై మృత‌క‌ణాలు, నూనెలను తొలగిస్తుందని మేకప్ మరింత సాఫీగా అప్లై చేయడానికి సహాయపడుతుందని ఆమె పేర్కొంది. అలాగే షేవింగ్ చేసుకోవడం చర్మానికి ఎలాంటి హాని చేయదని చెప్పుకొచ్చింది.

Show comments