NTV Telugu Site icon

Vidadala Rajini vs Pattipati Pullarao: పల్నాడులో మాజీ మంత్రుల మాటల యుద్ధం.. మాస్ వార్నింగ్ లు..!

Vidadala Rajini Vs Pattipat

Vidadala Rajini Vs Pattipat

Vidadala Rajini vs Pattipati Pullarao: పల్నాడు జిల్లాలో కీలక నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.. చిలకలూరిపేటలో ఇద్దరు మాజీ మంత్రులు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు… తనది పురుషోత్తమ పట్నం అని, తనపై అక్రమ కేసులు పెడితే ఏం జరుగుతుందో చూస్తారు అంటూ మాజీ మంత్రి విడదల రజని హెచ్చరించారు… నాకే కాదు కుటుంబం, ప్రత్తిపాటి పుల్లారావుకు కూడా కుటుంబం ఉంటుందని, తాను మరో 30 ఏళ్లు చిలకలూరిపేట రాజకీయాల్లోనే ఉంటానని, నేను అధికారంలోకి వస్తే, రాజకీయాల నుండి రిటైర్డ్ అయినా సరే పుల్లారావు సంగతి చూస్తానని, ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి రజని…

Read Also: PM Modi: చంద్రబాబు తన ట్రాక్‌ రికార్డు నిరూపించుకున్నారు.. మోడీ ప్రశంసలు..

ప్రత్తిపాటి కట్టు కథ అల్లి మళ్లి తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించాడంటూ విడదల రజిని మండిపడ్డారు. 80 ఏళ్ల పైబడిన మా మామగారిపై కేసు పెట్టించాడు. ఎక్కడో ఫారిన్‌లో ఉంటున్న మా మరిదిపై కూడా అక్రమ కేసు పెట్టించాడు. పుల్లారావు మా కుటుంబంపై అక్రమ కేసులు పెట్టించి కక్ష సాధిస్తున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుర్తుపెట్టుకో.. మాకే కాదు నీకు కూడా కుటుంబం ఉంది. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుంది. నేను ఇంకా 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు రాజకీయాల్లో ఉంటా. నువ్వు ఎక్కడికి పారిపోయిన, నువ్వెక్కడ దాక్కున్న కచ్చితంగా లాక్కు రావటం ఖాయం. వడ్డీతో సహా చెల్లిస్తాం అంటూ మాస్‌ వార్నింగ్‌ ఇచ్చారు..

Read Also: Bengaluru Metro: ప్రయాణికులపై మెట్రో బాదుడు.. భారీగా పెరిగిన ఛార్జీలు

దీనికి కౌంటర్‌గా చిలకలూరిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కూడా అదే స్థాయిలో ఘాటుగా సమాధానం ఇచ్చారు.. అసలు నిలకడగా ఒకచోట రాజకీయాలు చేయలేని విడదల రజిని 30 ఏళ్లు రాజకీయాలు చేస్తానని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.. బీసీ మహిళ పేరుతో సింపతి పొందాలని చూస్తుందని, అసలు బీసీ మహిళ అని చెప్పుకునే అర్హత కూడా విడదల రజనీకి లేదన్నారు.. ఎక్కడో దాక్కొని, రాజకీయాలు చేయడం కాదని, రజనీకి చేతనైతే పురుషోత్తమపట్టణం కేంద్రంగా రాజకీయాలు చేయాలని సవాల్ విసిరారు… జగన్మోహన్ రెడ్డి అండతో అధికారంలో ఉన్నప్పుడు, రజని చేసిన దుర్మార్గాలు, అరాచకాలను బయటపెడతానని, స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.. దీంతో పల్నాడులో ఈ మాజీ మంత్రుల మధ్య, జరుగుతున్న మాటల యుద్ధం, ఆసక్తికరంగా మారింది….