Site icon NTV Telugu

Vidadala Rajini: జనం గుండెల్లో జగన్ ఉన్నారు.. మాజీ మంత్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Vidadala Rajini Speech

Vidadala Rajini Speech

Vidadala Rajini: జగన్ పర్యటన సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన కేసులో మాజీ మంత్రి విడదల రజినీని నేడు సత్తెనపల్లి పోలీసుల ఎదుట విచారణకు హాజరు అయ్యారు. అలాగే మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో విచారణకు హాజరయ్యారు. ఇక విచారణ అంతరం విడుదల రజిని మాట్లాడుతూ.. జగన్ పర్యటనకు జనసమీకరణ చేశామని కేసులు పెట్టారన్నారు. మేము జనసమీకరణ చేయలేదుని.. జగన్ పర్యటనకు వస్తున్నారని తెలిస్తే ప్రజలు తరలి వస్తున్నారని ఆమె అన్నారు.

Chairman’s Desk: యువత రాజకీయాల్లోకి ఎందుకు రావట్లేదు?.. కారణాలు ఇవేనా?

జనం గుండెల్లో జగన్ ఉన్నారు. కాబట్టే జనసమీకరణ చేయాల్సిన అవసరం లేదని, జగన్ పర్యటనకు అనేక ఆంక్షలు పెట్టారని ఆమె అన్నారు. చంద్రబాబుకు ఏంభయం పుట్టుకుందో తెలియదు‌ కానీ, పోలీసుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. సూపర్ సిక్స్ అంటూ మాయమాటలు చెప్పారని, చంద్రబాబు పాలనలో అందరూ మోసపోయామని జగన్ కు ప్రజలు చెబుతున్నారని ఆవిడ మాట్లాడారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, ఏడాది కాలంగా వేధిస్తూనే ఉన్నారని ఆమె వాపోయింది.

Ambati Rambabu: గతంలో ఎప్పుడూ కేసులు పెట్టిన దాఖలాలు లేవు.. మాపై కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నారు..!

జగన్ సీఎంగా చేసేంత వరకూ వైసీపీ నేతలెవరూ భయపడరన్నారు. రెడ్ బుక్ గురించి చంద్రబాబు, లోకేష్ ప్రచారం చేసారని, రెడ్ బుక్ ప్రకారమే పాలన చేస్తున్నారన్నారు. ఇంకా ఎంపీ మిథున్ రెడ్డిపై కూడా తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేసారని ఆమె వ్యాఖ్యానించారు. జగన్ చుట్టూ ఉన్న వారందరిని అరెస్ట్ చేయాలని చూస్తున్నారని ఆమె మాట్లాడారు.

Exit mobile version