Site icon NTV Telugu

Victor Noir Grave: మతితప్పినదా.. మదమెక్కినదా? సమాధిపై ఆ పాడు పనులు ఏంటి!

Victor Noir Grave

Victor Noir Grave

Victor Noir Grave: ఈ రోజుల్లో చాలా మందికి బతికి ఉన్నవాళ్లలో కలల రాకుమారులు ఉంటారని తెలుసు. కానీ ఆ దేశంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. అక్కడి మహిళల్లో చాలా మందికి ఒక చనిపోయిన వ్యక్తి కలల రాకుమారుడు. అవునండీ బాబు.. ఇది నిజం. ఆ మహిళల పిచ్చితో అక్కడి సమాధి స్థలాన్ని సెలబ్రిటీ స్పాట్‌గా మార్చివేశారు. ఆయనను తానడానికి, ఆయనకు ముద్దు ఇవ్వడానికి దేశంలోని ఎక్కడెక్కడి నుంచో మహిళలు వస్తుంటారు. ఇంతకీ ఆ దేశం ఏంటి, అక్కడ ఉన్న ఈ వింత పరిస్థితికి కారణం ఏంటో తెలుసా.. ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: Ponguleti Srinivas Reddy : అధిష్టానానికి ఫిర్యాదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన పొంగులేటి

అదే పారిస్‌లో అతిపెద్ద స్మశానవాటిక..
పారిస్‌లో అతిపెద్ద స్మశానవాటిక ఏంటో తెలుసా.. పెరే-లాచైస్ స్మశానవాటిక. ఆస్కార్ వైల్డ్, జిమ్ మోరిసన్, మోలియెర్, ఫ్రెడెరిక్ చోపిన్, థియోడర్ గెరికాల్ట్ వంటి అనేక మంది ప్రసిద్ధ వ్యక్తులను ఈ సమాధి స్థలంలో ఖననం చేశారు. కానీ స్మశానవాటికకు వీళ్ల ఎవరి కారణంగా కూడా ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు రాలేదు. కేవలం ఒక యువకుడి సమాధి కారణంగా ఈ సమాధి స్థలానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇంతకీ ఆ యువకుడు ఎవరో తెలుసా.. ఆయనే విక్టర్ నోయిర్. ఆయన సమాధి కారణంగానే ప్రపంచ వ్యాప్తంగా ఈ స్మశానవాటికకు ఇంత గొప్ప గుర్తించి వచ్చింది.

ఆయన ఎలా చనిపోయాడో తెలుసా..
పారిస్‌లో 19వ శతాబ్దం సమయంలో విక్టర్ నోయిర్.. లా మార్సెలైజ్ వార్తాపత్రికకు జర్నలిస్ట్‌గా పనిచేశాడు. ఆ వార్తాపత్రిక సంపాదకుడు పాస్చల్ గ్రౌసెట్‌ను నాటి పాలక చక్రవర్తి నెపోలియన్ III బంధువు ప్రిన్స్ పియరీ బోనపార్టే ద్వంద్వ పోరాటానికి సవాల్ చేశారు. దీనికి కారణంగా ఆ యువరాజు గురించి వివాదాస్పద కథనాన్ని ప్రచురించడం అని చెబుతారు. గ్రౌసెట్.. ప్రిన్స్ పియరీ ద్వంద్వ పోరాటాన్ని అంగీకరించి, సమయాన్ని, స్థలాన్ని ఏర్పాటు చేయడానికి తన వాళ్లను పంపారు. దురదృష్టవశాత్తు, వాళ్ల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సమయంలో హఠాత్తుగా వాగ్వాదం చెలరేగింది. కోపంతో ఊగిపోయిన బోనపార్టే తన పిస్టల్‌ను తీసి విక్టర్‌ను కాల్చి చంపారు.

చక్రవర్తి కుటుంబ సభ్యుడు ఒక జర్నలిస్టును హత్య చేయడం దేశంలో సంచలనం సృష్టించింది. అప్పటికే దేశంలో ఉన్న పరిస్థితులపై తీవ్ర అసంతృప్తి చెందిన ప్రజలకు ఈ ఘటన ఆగ్రహాన్ని జోడించింది. దీంతో వేలాది మంది ప్రజలు ఫ్రాన్స్ వీధుల్లో రావడంతో అనేక హింసాత్మక ప్రదర్శనలు జరిగాయి. దీంతో విక్టర్ నోయిర్ ఒక విప్లవాత్మక చిహ్నంగా మారారు. అతని స్వస్థలమైన న్యూయిలీలోని స్థానిక స్మశానవాటికలో జరిగిన ఆయన అంత్యక్రియలకు లక్ష మందికి పైగా జనం హాజరయ్యారు. ఈ సంఘటనలతో సంబంధం లేకపోయినా, ఆ ఏడాది చివర్లో ప్రష్యన్లు ఫ్రాన్స్‌ను ఆక్రమించి, 1870 సెప్టెంబర్ 4న ఫ్రెంచ్ సామ్రాజ్యాన్ని పడగొట్టారు.

విగ్రహంతో వింతైన ప్రచారం..
విక్టర్ నోయిర్‌ ప్రసిద్ధి చెందింది ఆయన మరణంతోనో లేదా రాజకీయ పరిణామాల కారణంగానో కాదు.. ఆయన సమాధి కారణంగా ఆయనకు విశేష ప్రచారం లభించింది. నోయిర్ మరణించిన ఇరవై ఏళ్ల తర్వాత, 1891లో మూడవ ఫ్రెంచ్ రిపబ్లిక్ స్థాపించిన తర్వాత విక్టర్ నోయిర్ మృతదేహాన్ని .. ఆయన స్వస్థలం నుంచి పారిస్‌లోని పెరే లాచైస్ స్మశానవాటికకు తరలించారు. ప్రఖ్యాత ఫ్రెంచ్ శిల్పి జూల్స్ డలౌకు నోయిర్ సమాధి కోసం కాంస్య శిల్పాన్ని రూపొందించే పని అప్పగించారు. శిల్పి జూల్స్ డలౌకు నోయిర్ విగ్రహాన్ని ఆయన మరణించిన సమయంలో కాల్చి చంపిన తర్వాత నేలపై పడి ఉన్నట్లు చిత్రీకరించారు. తెలియని కారణాల వల్ల, ఆయన తన శిల్పానికి బెల్ట్ కింద గుర్తించదగిన ఉబ్బెత్తును ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆయన ఇలా ఎందుకు దానిని రూపొందించారో తెలియదు. కేవలం ఇదే విక్టర్ నోయిర్ సమాధిని కాలక్రమేణా సంతానోత్పత్తి, లైంగిక ఆనందానికి చిహ్నంగా మార్చింది. ఇదే వింతైన పుకారు ఏర్పడటానికి దారితీసిందని చరిత్రకారులు చెబుతున్నారు.

సంతానోత్పత్తి చిహ్నంగా ఎలా మారిందో తెలుసా..
నోయిర్ సమాధిపై వింతైన పుకారు చాలా వేగంగా ప్రచారం పొందింది. ఒక స్త్రీ విక్టర్ నోయిర్ విగ్రహాన్ని పెదవులపై ముద్దు పెట్టుకుంటే, ఆయన ప్యాంటులోని ఉబ్బెత్తును రుద్దితే, ఆయన టోపీలో ఒక పువ్వును వేస్తే, అది ఆమెకు మెరుగైన సంతానోత్పత్తిని, ఆనందకరమైన లైంగిక జీవితాన్ని తెస్తుందని చాలా మంది నమ్ముతారు. ఇక్కడ మరికొన్ని కథనాలు కూడా విశేష ప్రచారంలో ఉన్నాయి.. మీరు ఒక అందమైన ప్రేమికుడిని కనుగొనాలనుకుంటే, మీరు నోయిర్ పెదవులను ముద్దు పెట్టుకోవాలని కొన్ని కథనాలు చెబుతుంటే, మీరు గర్భం ధరించాలనుకుంటే, మీరు అతని కుడి పాదాన్ని తాకాలని, మీరు కవలలను కనాలనుకుంటే మీరు అతని ఎడమ పాదాన్ని తాకాలని, ఇవి చేస్తే త్వరలోనే మీకు ఒక బిడ్డ వస్తుందని, ఒంటరి స్త్రీలు ఏడాదిలోపు భర్త దొరుకుతాడని కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

ఈ ప్రచారాలను అక్కడి ప్రజలు చాలా తీవ్రంగా పరిగణిస్తారనడానికి ఈ విగ్రహమే ఒక సజీవ రుజువు. ఎందుకంటే విక్టర్ నోయిర్ పెదవులు, ఆయన ప్యాంటులోని ఉబ్బెత్తు స్థలం, బూట్లు మెరుస్తూ ఉంటాయి, అయితే ఆయన విగ్రహంలోని మిగిలిన శరీరం ఆక్సిడైజ్డ్ కాంస్య రంగు, సాధారణ ఆకుపచ్చ టోన్‌ను కలిగి ఉంటుంది. అందుకే అక్కడి ప్రభుత్వం 2004లో నోయిర్ విగ్రహం చుట్టూ ఒక కంచెను ఏర్పాటు చేశారు. దానితో పాటు అక్కడ ఒక హెచ్చరిక గుర్తును కూడా ఏర్పాటు చేశారు. “గ్రాఫిటీ లేదా అసభ్యకరమైన రుద్దడం వల్ల కలిగే ఏదైనా నష్టంపై కేసు నమోదు చేయబడుతుంది” అని ఆ బోర్డుపై ఏర్పాటు చేశారు. కానీ ఈ హెచ్చరిక బోర్డుపై చాలా మంది మహిళలు ఆందోళనలు లేవనెత్తడంతో కంచె కూల్చి వేశారు.

ఇక్కడ మరో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే.. విక్టర్ నోయిర్ సమాధిని సందర్శించిన తర్వాత గర్భవతి అయిన మహిళలు కృతజ్ఞతగా స్మశానవాటికకు తిరిగి వచ్చి, వారి పిల్లల ఫోటోలు, ఇతర వస్తువులను విగ్రహం దగ్గర ఉన్న టోపీలో పెడతారు.

READ ALSO: Hamas Hostages 2025: ఒక్కొక్కరిదీ ఒక్కో కథ.. హమాస్ చెర నుంచి విడుదలైన బందీలు

Exit mobile version