Site icon NTV Telugu

Sanatana Dharma: సనాతన ధర్మంపై దుర్భాషలా..? ఉదయనిధిని బర్తరఫ్‌ చేయాలి..

Milind Parande

Milind Parande

Sanatana Dharma: సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి, సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపుతున్నాయి.. బీజేపీ నేతలు, హిందూ సంఘాలు, వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్‌ లాంటి సంస్థల నేతలు విరుచుకుపడుతున్నారు.. ఇప్పటికే ఈ వ్యవహారంపై పలు సందర్భాల్లో స్పందించిన విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ సెక్రెటరీ మిలింద్ పరాండే.. మరోసారి ఉదయనిధిపై మండిపడ్డారు.. సనాతన ధర్మంపై దుర్భాష లాడిన మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్‌ చేశారు. తమిళనాడు క్రీడామంత్రి ఉదయనిధి స్టాలిన్ పై కఠిన చర్యలు తీసుకోవాలన్న ఆయన.. హిందువులను అవమానించిన ఉదయనిధి స్టాలిన్ ముందు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ వినిపించారు.

Read Also: Health Tips: రోజూ పిస్తా పప్పులను తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

మరోవైపు.. రాహుల్ గాంధీ మాత్రమే తన పాదయాత్రకి భారత్ జోడో యాత్ర అని పెట్టుకోవచ్చు.. కానీ, ఇండియాకి భారత్‌ పేరు పెట్టకూడదా..? అని ప్రశ్నించారు మిలింద్‌ పరాండే.. ఆంధ్రప్రదేశ్‌లో కూడా మతమార్పిడుల నిషిద్ధం విధించాలని సూచించారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వాఖ్యలు చేశారు.. ఇక, సుప్రీం కోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలి అని దేశంలో 140 మంది ప్రముఖ మేధావులు అందరూ తీర్మానం చేశారన్నారు. మల్లికార్జున ఖర్గే, చిదంబరం కొడుకులు ఉదయనిధి స్టాలిన్ వాఖ్యలను సమర్ధించడం బాధాకరం అని.. తమిళ ప్రజలు కూడా ఈ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు వీహెచ్‌పీ అంతర్జాతీయ సెక్రెటరీ మిలింద్ పరాండే. కాగా, తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌పై తప్పుడు ప్రచారం సాగుతోందంటూ సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు.. బీజేపీ వక్రీకరించినట్లు సనాతన ధర్మం నిర్మూలనకు ఉదయనిధి పిలుపునివ్వలేదు.. కానీ, వివక్షకు వ్యతిరేకంగా మాత్రమే మాట్లాడారు.. బాధ్యతగల ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు మరియు బీజేపీ నేతలు వాస్తవాలను విస్మరించడం సరైందికాదన్నారు.. వాస్తవాలను ధృవీకరించుకోవడానికి అన్ని వనరులు ఉన్నప్పట్టికీ.. నకిలీ కథనాలను నడపడం చూసి నిరుత్సాహంగా ఉందని పేర్కొన్నారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌.

Exit mobile version