NTV Telugu Site icon

Actress Passes Away : సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

Daljit Kaur

Daljit Kaur

Actress Passes Away : సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. నిన్న గాక మొన్న టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మరణాన్ని మరచిపోక ముందే ఇండస్ట్రీ మరో సీనియన్ నటిని కోల్పోయింది. ప్రముఖ పంజాబీ నటి దల్జీత్ కౌర్(69) నిన్న రాత్రి కన్ను మూశారు. ఆమె గత మూడేళ్లుగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నారు. ఏడాది క్రితం నుంచి ఆమె కోమాలోనే ఉన్నారు. ఈ క్రమంలో పంజాబ్లోని లూథియానాలో నిన్నరాత్రి తుదిశ్వాస విడిచారు.

Read Also: Twitter : ఎలాన్ మస్క్‎కు ఉద్యోగుల షాక్.. ట్విట్టర్‎కు వందలాది మంది గుడ్ బై

ఆమె నరాల సంబంధిత సమస్యతో బాధపడుతూ సుమారు 12 ఏళ్ల క్రితం ముంబై నుంచి లూథియానాకు వెళ్లింది. ఆమె గత కొన్ని సంవత్సరాలుగా లూథియానాలోని గురుసర్ సుధార్ ప్రాంతంలో తన బంధువు హర్జీందర్ సింగ్ ఖంగురాతో కలిసి నివసిస్తోంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గత ఏడాది కాలంగా తీవ్ర కోమాలో ఉన్నారు. ఆమె 1976లో పంజాబీ చిత్రం ‘దాజ్’తో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. పుట్ జట్టన్ దే, మమ్లా గర్బార్ హై, కి బాను దునియా దా, పటోలా, సైదా జోగన్‌తో సహా 10 హిందీ, 70 పంజాబీ సినిమాల్లో నటించారు. తన భర్త హర్మీందర్ సింగ్ డియోల్ ను రోడ్డు ప్రమాదంలో కోల్పోయిన తర్వాత ఆమె తన చిత్ర పరిశ్రమను విడిచిపెట్టారు. పంజాబీ చిత్ర పరిశ్రమకు కౌర్ అందించిన సహకారం మరువలేనిదని నటుడు, దర్శకుడు తర్లోచన్ సింగ్ అన్నారు.

Read Also:House Fire: చంద్రగ్రహణం తెచ్చిన తంట.. అప్పటినుంచి ఆ ఇంట్లో రోజు మంటలే..

లూథియానాలోని ఐటియానా గ్రామానికి చెందిన కౌర్ 1953లో పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో వ్యాపార కుటుంబంలో జన్మించారు. ఆమె ఢిల్లీలోని లేడీ శ్రీ రామ్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి యాక్టింగ్ కోర్సు చేశారు. ఆమె హాకీ, కబడ్డీ క్రీడాకారిణి కూడా.

Show comments