ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో పలు ఓటీటీ సంస్థలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.అయితే ఓటీటీలకు సెన్సార్ నిబంధన లేకపోవడంతో బోల్డ్ కంటెంట్ తో పలు మూవీస్, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం అదే ట్రెండ్ ఫాలో అవుతూ త్వరలో ఆహా ఓటీటీ లోకి మిక్స్ అప్ అనే చిత్రం రాబోతోంది.ఆదర్శ్,అక్షర గౌడ, కమల్ కామరాజు, పూజ జవేరి ప్రధాన పాత్రలలో నటించిన మిక్స్ అప్ మూవీ విడుదలకు సిద్ధం అయ్యింది. ఆహా ఒరిజినల్ ‘మిక్స్ అప్’ మూవీ మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను ఆహా విడుదల చేసింది… పెళ్లైన రెండు జంటలకు వారి రొటీన్ లైఫ్ బోర్ కొట్టడం అవతలి జంటపై లస్ట్ పెరిగి ఒక్కటవటం అనే కాన్సెప్ట్‌తోనే ఈ చిత్రం ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఓటీటీ ప్రారంభంలో ఇలాంటి ఒకటి రెండు బోల్డ్ సినిమాలు తీసుకువచ్చిన ఆహా ఓటీటీ మళ్లీ ఇన్నాళ్ల తర్వాత పూర్తిగా అడల్ట్ కంటెంట్‌తో మిక్స్ అప్ ని తీసుకొస్తుండటంతో ఈ మూవీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సినిమా మొత్తం ఓ పెళ్లైన జంట, ఓ లవ్‌లో ఉన్న జంట చుట్టూ తిరుగుతూ ఇంటిమేట్ సన్నివేశాలతో పాటు, డబుల్ మీనింగ్ డౌలాగ్స్ కూడా బాగానే దట్టించినట్టు ట్రైలర్ చూస్తేనే అర్ధం అవుతుంది..అయితే ఈ చిత్రం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె నటించిన గెహరియన్ కి కాపీలా ఉందని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. యూత్ ని టార్గెట్ చేసేలా ఇంటిమేట్ సన్నివేశాలు, డబుల్ మీనింగ్ డైలాగులు చూపించారు. అక్షర గౌడ శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించింది.. మరోవైపు ఆదర్శ్ పాత్రని కూడా బోల్డ్ గా చూపించారు. కమల్ కామరాజు మరియు పూజా జవేరి పాత్రలో కాస్త సాఫ్ట్ గా ఉన్నాయి.
