చిన్న సినిమాగా వచ్చిన ‘ బలగం ‘ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమాను దర్శకత్వం వహించిన వేణుకి మంచి గుర్తింపు లభించింది. తెలంగాణ పల్లె లోని కుటుంబ అనుబంధాల నేపథ్యం లో వచ్చిన బలగం సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాను ఎంతో ఎమోషనల్ గా తెరకెక్కించారు దర్శకుడు వేణు. ఎంచుకున్న కథను ప్రేక్షకులకు సరిగ్గా కనెక్ట్ అయ్యేలా చేయడంలో వేణు సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.బలగం సినిమా పెట్టిన బడ్జెట్ కి 3 రెట్లు తిరిగి లాభాలు వచ్చాయి. దీంతో దిల్ రాజు మరోసారి వేణు కి ఛాన్స్ ఇచ్చారని సమాచారం.వేణు తరువాత సినిమా కూడా శ్రీ వెంకటేశ్వర బ్యానర్ లోనే ఉంటుందని తెలుస్తుంది.
బలగం సినిమా హిట్ అవ్వడం తో దిల్ రాజు ఈసారి బడ్జెట్ గురించి అసలు ఆలోచించవద్దని చెప్పినట్లు సమాచారం.. అయితే వేణు తన తరువాత సినిమాని స్టార్ హీరో తో చేయాలనీ ఉంది అని అడిగినట్లు సమాచారం.వేణు అడిగినది విని దిల్ రాజు షాక్ అయ్యాడని వార్తలు వస్తున్నాయి. బలగం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను ఇచ్చిన తరువాత వేణు టాలెంట్ గుర్తించకపోతే ఎలా అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎంతో మంది దర్శకులు మొదటి సినిమా తోనే కోట్ల బడ్జెట్ తో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు.అలాంటిది బలగం వంటి మంచి ఎమోషనల్ సినిమాను అందించిన వేణు స్టార్ హీరోని డైరెక్ట్ చేయాలనుకోవడంలో తప్పులేదని అంటున్నారు నెటిజన్స్.దర్శకుడు వేణు ని ప్రోత్సాహిస్తే బలగం వంటి మంచి సినిమాలు వస్తాయి అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.మరీ వేణు తన తరువాత సినిమాను స్టార్ హీరోతో చేస్తారా లేదా అనేది చూడాలి.అలాగే బలగం సినిమాకి నేషనల్ అవార్డు రావాలని ప్రేక్షకులు కూడా ఎంతగానో కోరుకుంటున్నారు.