టాలీవుడ్ నటుడు శివాజీ ఇటీవల మహిళల వస్త్రధారణ పై చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై జ్యోతిష్యుడు వేణు స్వామి తనదైన శైలిలో స్పందించారు. ‘శివాజీ లాగా నేను మాట్లాడి ఉంటే ఈపాటికి నన్ను జైల్లో వేసేవారు, మీడియా ఛానల్స్ నన్ను ఊరూరా టార్గెట్ చేసేవి. అవసరమైతే ఐక్యరాజ్యసమితిని కూడా రంగంలోకి దించి నన్ను బతకనిచ్చేవారు కాదు’ అని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తాను నాగచైతన్య-శోభితల నిశ్చితార్థం పై జాతకం చెబితేనే తనను ఎంతో టార్గెట్ చేశారని, ఇక్కడ అందరికీ ఒకే రకమైన న్యాయం జరగడం లేదని ఆయన విమర్శించారు. అంతే కాదు సెలబ్రిటీల జీవితాల గురించి చెబుతూ ఆయన కొన్ని షాకింగ్ నిజాలు బయటపెట్టారు.
Also Read : Malaika Arora: విడాకులు, బ్రేకప్స్‌పై షాకింగ్ నిజాలు బయటపెట్టిన మలైకా..!
‘మీకు బయట రేంజ్ రోవర్లలో తిరిగే హీరోయిన్లు కనిపిస్తారు, కానీ నాకు మాత్రం లోన్లు కట్ట లేక రోడ్డున పడ్డ వాళ్ళు కనిపిస్తారు. అలాగే మీకు గంభీరంగా కనిపించే నాయకులు, రేపు జైలుకు వెళ్లే వాళ్లుగా నాకు కనిపిస్తారు’ అంటూ తన జాతక విశ్లేషణను వివరించారు. అనసూయ ఫోటోల గురించి ప్రస్తావిస్తూ.. సోషల్ మీడియాలో పెట్టే ఏ ఫోటోపై అయినా మాట్లాడే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు.. ‘మీకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులే నాకు ఉన్నాయి.. కానీ తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్లస్ రెండు ఐదు అవుతుంది’ అంటూ ప్రస్తుత పరిస్థితులపై వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తనకు అమ్మవారి దీవెన ఉందని, ఎవరు ఎన్ని అన్నా తాను పట్టించుకోనని వేణు స్వామి తేల్చి చెప్పారు.
