టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘చారి 111’. స్పై అండ్ కామెడీ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ మార్చి 1వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. చారి 111 మూవీని దర్శకుడు టీజీ కీర్తికుమార్ తెరకెక్కించారు.ఈ మూవీలో వెన్నెల కిశోర్‌తో పాటు సంయుక్త విశ్వనాథన్, మురళీ శర్మ, పావని రెడ్డి, సత్య, తాగుబోతు రమేశ్ మరియు బ్రహ్మాజీ కీలకపాత్రలు పోషించారు.. బర్కత్ స్టూడియోస్ పతాకంపై ఆదిత్య సోనీ ఈ మూవీని నిర్మించారు. సిమన్ కే కింగ్ సంగీతం అందించారు.ఈ మూవీలో వెన్నెల కిశోర్ తన మార్క్ కామెడీ తో అదరగొట్టారు. అయితే, ఈ మూవీకి ఆడియన్స్ లో అంత బజ్ క్రియేట్ కాకపోవడంతో థియేటర్లలో ఆశించిన స్థాయిలో చారి 111 కలెక్షన్లను రాబట్టలేకపోయింది. అయితే, ఓటీటీలో మాత్రం ఈ మూవీ దూసుకుపోతుంది.
చారి 111 సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఏప్రిల్ 5వ తేదీన స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. సడెన్‍గా ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ మొదటి నుంచే మంచి వ్యూస్ వస్తున్నాయి.. తాజాగా ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ మూవీ 60 మిలియన్ వ్యూయింగ్ నిమిషాలను దాటేసింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ వెల్లడించింది.ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఇండియా టాప్-10లో ఈ చిత్రం రెండు వారాలుగా ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు 60 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ కూడా దాటేసింది. అంతగా బజ్ క్రియేట్ కాకపోవడంతో ఈ మూవీ థియేటర్ ప్రేక్షకులని అంతగా ఆకట్టుకోలేదు.చారి 111 చిత్రానికి సీక్వెల్ కూడా తీసుకొస్తామని దర్శకుడు టీజీ కీర్తికుమార్ గతంలో చెప్పారు. దీన్ని యూనివర్స్‌లా మారుస్తాం అని అన్నారు.. అయితే, చారి 111 థియేటర్లలో వర్కౌట్ కాకపోవటంతో సీక్వెల్ తీసుకొస్తారా వస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది