టాలీవుడ్ లో ఎంటర్టైనర్ పరంగా ఉన్న ఎవర్ గ్రీన్ సినిమాల్లో ఒకటి శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన వెంకీ సినిమా ఒకటి. రవితేజ, స్నేహ ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఇప్పటికి రిలీజ్ అయ్యి 20 ఏళ్లు అయ్యింది. ఇకపోతే ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన సీక్వెల్ రావచ్చన్న వార్త బయటకు వచ్చింది. ఈ విషయంపై తాజాగా డైరెక్టర్ శ్రీను వైట్ల ఓ ఇంటర్వ్యూలో వెంకీ సీక్వెల్ గురించి మాట్లాడారు. వెంకీ సినిమా రీ-రిలీజ్ కి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే.. వెంకీ – 2 చేయడానికి తాను ప్రేరణ పొందినట్లు తెలిపారు. అయితే ఇందుకు తగ్గటే ప్రస్తుతం ఆయన వెంకీ సీక్వెల్ కొరకు స్క్రిప్ట్ రాస్తున్నారట. ఇప్పటికైతే తనకు వెంకీ సినిమా సీక్వెల్ ఆలోచన ఉన్నా కానీ.. అది ఎప్పుడు బయటికి వస్తుందో తెలియదని శ్రీను వైట్ల అన్నారు.
Also read: Palamuru to Goa: గోవాలో పాలమూరు ప్రజాప్రతినిధులు ఎంజాయ్..?
ఇదివరకు మంచి కథలకు కామెడీ జోడించి సినిమాలు తీయడంలో శ్రీను వైట్ల ఒక దశలో వరుసగా విజయాలు అందుకున్నారు. ఆనందం, సొంతం, వెంకీ, ఢీ, దుబాయ్ శీను, రెడీ, దూకుడు, బాద్ షా లాంటి ఎన్నో కామెడీ – యాక్షన్ ఎంటర్టైనర్లు అందించి ప్రేక్షకులని అలరించారు. ఇక ఇప్పటికీ ఈయన తీసిన సినిమాలను మళ్ళీ మళ్ళీ చూసి ప్రేక్షకులు ఆనందిస్తూ ఉంటారు. ముఖ్యంగా 2004లో శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ ప్రధాన పాత్రలో వచ్చిన ‘వెంకీ’ చిత్రానికి 2 తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికి అభిమానులు ఉన్నారు.
Also read: TDP vs Janasena: తిరుపతిలో అనూహ్య పరిణామాలు.. జనసేన పోటీపోటీ సమావేశాలు..! టీడీపీ రహస్య భేటీ..!
ఈ సినిమాలోని అనేక కామెడీ సన్నివేశాల మీద ఎన్నో సోషల్ మీడియాలో వేల సంఖ్యలో మీమ్స్ తయారయ్యాయి. పరిస్థితి ఏదైనా సరే.. అసలు వెంకీ సినిమాలోని సీన్ సంబంధించి మీమ్ లేకుండా సోషల్ మీడియాలో మూవీ నెటిజన్లు పోస్ట్ చేయరు అంటే అది అతిశయోక్తి కాదేమో. దీని బట్టి చూస్తే ఆ సినిమా ఏ స్థాయిలో హిట్ అయ్యిందో చెప్పనక్కరలేదు. ఇక ఈ సినిమాని కొద్దీ రోజుల క్రితం థియేటర్లలో రీ రిలీజ్ చేయగా ప్రతిచోటా హౌజ్ ఫుల్స్ ను నమోదు చేసింది. దింతో ఇప్పుడు వెంకీ సీక్వెల్ పై ఫోకస్ పెట్టిన శ్రీను వైట్ల ప్రయత్నం ఫలించి ప్రేక్షకులకి మరో క్లాసిక్ ఎంటర్టైనర్ అందివ్వాలని కోరుకుందాము.