Venkatesh : చిరంజీవి లేకుంటే హిమాలయాలకు వెళ్లిపోయేవాడిని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ సినిమా సైంధవ్. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో జేఈర్సీ కన్వెన్షన్ సెంటర్లో వెంకీ 75 కలియుగ పాండవులు టు సైంధవ్ పేరుతో మేకర్స్ స్పెషల్ ఈవెంట్ ను నిర్వహించారు.ఈ వేడుకకు చిరంజీవి చీఫ్ గెస్టుగా విచ్చేసారు. అలాగే నాని, ఆండ్రియా, రుహానీ శర్మ మరియు డైరెక్టర్ శైలేష్ కొలనుతోపాటు పలువురు తారలు ఈ ఈవెంట్ లో సందడి చేశారు.వెంకీ 75 కార్యక్రమంలో తన మొదటి సినిమా కలియుగ పాండవులు గురించి చెబుతూ వెంకటేష్ పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. “గురువు కె. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన కలియుగ పాండవులు చిత్రంతో నా సినీ ప్రయాణం మొదలైంది. దాసరి నారాయణరావు మరియు కె విశ్వనాథ్ పలువురు అగ్ర దర్శకులతో కలిసి పని చేయడం అద్భుతమైన అనుభవం. అభిమానుల ప్రేమతోనే ఇన్ని సినిమాలు చేశాను” అని వెంకటేష్ తెలిపారు.”జయాపజయాల్ని చూడకుండా నేను చేసిన విభిన్న చిత్రాలను గమనించి నన్ను ప్రోత్సహించారు.
మొదట్లో విక్టరీ అనేవారు. తర్వాత రాజా అని పిలిచేవారు. కొన్నాళ్లు పెళ్లికాని ప్రసాద్ అని అనేవారు.. తర్వాత పెద్దోడు మరియు వెంకీ మామ అన్నారు. ఇలా పిలుపు మారినా కానీ ప్రేమ మాత్రం తగ్గలేదు. అందుకే ఎప్పటికప్పుడు మరింత ఉత్సాహంగా పని చేస్తున్నాను” అని వెంకటేష్ అన్నారు.చాలాసార్లు సినీ కెరీర్‌ను వదిలి పెట్టి హిమాలయాలకు వెళ్లిపోదాం అనుకునేవాణ్ని. అంతలోనే చిరంజీవి వచ్చి ఓ బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చేవారు. నాతోటి హీరోలైనా బాలకృష్ణ మరియు నాగార్జున వీళ్లంతా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేవారు. అందుకే హిమాలయాలకు వెళ్లకుండా సినిమాలను కొనసాగించాను అని వెంకటేష్ తెలిపారు.నా 75వ చిత్రం సైంధవ్ ఎంతో గొప్ప మూవీ అవుతుంది. జనవరి 13న అందరినీ ఎంతగానో అలరిస్తుంది.కృషి, పట్టుదల, నిలకడతోనే విజయాలు సాధ్యం అవుతాయి. ఎక్కువ హైరానా పడకుండా సహజంగా ఉండేందుకు అందరూ ప్రయత్నించాలి. ఏదైనా రావాల్సిన సమయంలోనే వస్తుంది. చిరంజీవితో కలిసి త్వరలోనే నేను మూవీ చేస్తా” అని వెంకటేష్ తెలిపారు..
Also Read
- RCB Fans Celebrations: అర్థరాత్రి RCB ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. పోలీసుల లాఠీచార్జ్.!
- IPL 2026 Awards Winners List: వైభవ్ సూర్యవంశీ హవా.. ఐపీఎల్ 2026లో అవార్డ్స్ గెలుచుకున్న స్టార్ ప్లేయర్స్ వీరే..!
- Anushka Sharma: విరాట్ ఫినిష్ ఆఫ్ ఇట్స్ స్టైల్.. అనుష్క శర్మ రియాక్షన్ మాములుగా లేదుగా.!
- Vaibhav Sooryavanshi: ఒకే ఒక్కడు.. బోలెడు రికార్డులు.. క్యూ కట్టిన అవార్డ్స్ ఇవే.!
తాజావార్తలు
-
RCB Fans Celebrations: అర్థరాత్రి RCB ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. పోలీసుల లాఠీచార్జ్.!
-
IPL 2026 Awards Winners List: వైభవ్ సూర్యవంశీ హవా.. ఐపీఎల్ 2026లో అవార్డ్స్ గెలుచుకున్న స్టార్ ప్లేయర్స్ వీరే..!
-
Lyca : వరుస డిజాస్టర్లతో ‘లైకా ప్రొడక్షన్స్’ సంక్షోభం.. కాపాడే సినిమా ఏది?
-
Gujarat Titans: గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు తప్పిన పెను ప్రమాదం.. తృటిలో బతికి బయటపడ్డారు.. ఊపిరి పీల్చుకున్న బీసీసీఐ!
-
Masoud Pezeshkian: అమెరికాతో ఉద్రిక్తతల మధ్య ఇరాన్లో రాజకీయ సంక్షోభం.. అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ రాజీనామా..!
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!