NTV Telugu Site icon

Anam Ramnarayana Reddy; 15 నెలల్లో ఏం మార్పులు వస్తాయో చూడాలి

Anam 1

Anam 1

తన స్వంత పార్టీ, ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి. నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేల వ్యవహారం ఆసక్తిగా మారుతోంది. వెంకటగిరిలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను కాదని రాజ్యాంగేతర శక్తులు అధికారం చెలాయించడం ఎంతవరకు సబబని ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి ప్రశ్నించారు. నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అధికారులు బదిలీలు చేసి భయభ్రాంతులకు గురి చేసి పాలనను సాగించాలనుకోవడం సరి కాదన్నారు. వాస్తవంగా వెంకటగిరిలో వైసిపి పరిష్టంగా ఉండేదని ప్రస్తుతం మూడు వర్గాలుగా విడిపోయిందని అన్నారు. తనకు భద్రత తగ్గించడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని అసలు భద్రతే వద్దని తాను అధికారులకు చెప్పానన్నారు.

రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీల పాలనపై ప్రజలు అంత సంతృప్తిగా లేరని. మూడో ప్రత్యామ్నాయం వస్తే బాగుంటుందని తాను అభిప్రాయపడుతున్నట్లు ఆనం వెల్లడించారు. ఈ విషయంపై మేధావులు రాజకీయ విశ్లేషకులు, జర్నలిస్టులు ఆలోచించాలని ఆయన సూచించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ని వైసిపి అధిష్టానం పక్కన పెట్టిన సంగతి తెలిసిందే.

Read Also: Dj Tillu: అర్జున్ దాస్ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ లో టిల్లు అన్న సందడి…

ఈ పరిణామాల అనంతరం ఆయన నేతలతో మొదటిసారి సమావేశమయ్యారు. సైదాపురం మండలానికి చెందిన నేతలతో నిర్వహించే ఈ సమావేశంపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని నియమించిన తర్వాత ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని మానేసి.. ఆనం మౌనంగా ఉన్నారు. తాజాగా ఆయన మరోమారు పార్టీ, ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికలకు ఇంకా 15 నెలల సమయం ఉందని, అప్పటివరకూ ఏమైనా జరగవచ్చన్నారు.

నాకు సెక్యూరిటీని తగ్గించారు.నాకు ప్రాణ హాని ఉంది.నన్ను భూమి మీద లేకుండా చేయాలని ప్రయత్నాలు సాగుతున్నాయి.అది కూడా జరుగుతుందేమో చూడాలి.నేను కోర్టు కేసుల్లో ముద్దాయిని కాను. ఎలాంటి నేర చరిత్ర లేదు.హత్యా రాజకీయాలు చేయలేదు.సి.బి.ఐ.కేసుల్లో హైదరాబాద్ చుట్టూ తిరగడం లేదు.నక్సల్స్ ప్రభావం ఉన్న ఐదు మండలాలు నా నియోజకవర్గంలో ఉన్నాయి.కేంద్ర ప్రభుత్వమే ఈ మండలాలను తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించింది.నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి నుంచి దిగిపోయినా భారీ భద్రత కల్పించారు.

ఆయనకు ఉన్న ముప్పు అలాంటిది. కానీ నాకు భద్రత తగ్గించారు.రాజ్యాంగేతర శక్తి వెంకటగిరి కి వచ్చిన తర్వాతే నా కటౌట్ ను తగల బెట్టారు.వేధింపులు..సాధింపులు కొత్త కాదు.అన్నిటికీ సిద్ధపడ్డాను.నా రాజకీయం నేను చేస్తా..నాకు రెండు ఫోన్లు ఉన్నాయి. నా పి..ఏ.తో పాటు నా ఫోన్ ను టాప్ చేస్తున్నారు.నెల్లూరులో మాఫియా గ్యాంగ్ లు ఉన్నాయని మాట్లాడినప్పటినుంచి నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.నేను ఇప్పటికీ యాప్ ల ద్వారా మాట్లాడుతున్నా. నా బిడ్డ లతో కూడా ఈ కాల్స్ తోనే మాట్లాడుతున్నా అన్నారు ఆనం.

Read Also: Ujjwala Yojana: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్.. పెరగనున్న సబ్సిడీ

Show comments