Maria Corina Machado: అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ కల చెదిరింది. వాస్తవానికి ట్రంప్‌కు నోబెల్ బహుమతి శాంతి బహుమతి కైవసం చేసుకోవాలనే కోరిక బలంగా ఉంది. కానీ వాస్తవానికి శుక్రవారం ఆయనను మట్టికరిపించి వెనిజులా ఉక్కు మహిళ ఈ ప్రతిష్టాత్మకమై పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు. ఇంతకీ ఈ ఉక్కు మహిళ ఘనత ఏంటి, ఆమెను నోబెల్ వరించడానికి వెనుక ఉన్న కారణాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: AP Cabinet Meeting: కేబినెట్‌లో మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్!
ఆమె నేపథ్యం ఏమిటంటే..
కారకస్‌లో మరియ జన్మించారు. ఆమె తండ్రి వెనిజులా రాజధాని కరాకస్‌లో పేరున్న స్టీల్ బిజినెస్‌మన్, తల్లి సైకాలజిస్ట్. ఈ దంపతులకు మొత్తం నలుగురు ఆడపిల్లలు. వారిలో పెద్దమ్మాయి మరియ. ఆమె పూర్తి పేరు మరియ కొరీనా మచాదో పరిస్కా. తండ్రి పేరులోని మచాదో, తల్లి పేరులోని కొరీనా పరిస్కా కలిసి వచ్చేలా ఆమెకు ఆ పేరు పెట్టారు. మరియ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ చదివారు. కరాకస్‌లోని వీధి బాలల కోసం 1992లో ఒక అనాథాశ్రమం నెలకొల్పారు. 2002లో జాయిన్ అప్ అని అర్థం వచ్చేలా ‘సూమేట్’ అనే వాలంటీర్‌ల వ్యవస్థను ప్రారంభించారు. రాజకీయ హక్కులను స్వేచ్ఛగా వినియోగించుకోవటం, ప్రజా ప్రయోజన విషయాల మీద చర్చ వంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంటుంది ఆ సంస్థ.
అప్పుడే ప్రశ్నించడం ప్రారంభించింది..
వెనిజులా నేషనల్ అసెంబ్లీలో పదముడేళ్ల క్రితం ఒక రోజు ఆ దేశ అధ్యక్షుడు హ్యూగో చావెజ్ దేశ పురోగతి గురించి ప్రసంగిస్తూ ఉన్నారు. ఆ అసెంబ్లీలో కూర్చొని ఉన్న హేమాహేమీలు సైలెంట్‌గా ఆయన మాట్లాడేది వింటున్నారు. అప్పుడు నిలబడింది ఆ దేశ ప్రజలు ముద్దుగా ఉక్కు మహిళ అని పిలుచుకునే మరియ కొరీనా మచాదో.. ఆమె లేచి నిలబడి ఆ దేశ అసెంబ్లీ సాక్షిగా ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు.. ‘‘మీ విధానాలు నిజంగా బాగున్నాయనే మీరు అనుకుంటున్నారా?’’ అని ఆమె ప్రశ్నించిన తీరుతో అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు.
మరియ మాటలకు అప్పటి దేశ అధ్యక్షుడు డిస్టర్బ్ అయినట్లు ఆమె వైపు తలతిప్పి చూసి.. ఆగ్రహంతో, తీవ్రమైన స్వరంతో.. ‘‘ఈగను డేగ వేటాడదు.. కూర్చో’’ అని పెద్దగా అరిచారు. ఇలా మాట్లాడిన చావెజ్ ఇప్పుడు లేరు. సుమారుగా పన్నెండేళ్ల క్రితమే ఆయన మరణించారు. ఆయన ఆ రోజు అసెంబ్లీలో ఆమెను ఎందుకు ఈగతో పోల్చారో తెలియదు.. కానీ ఇప్పుడు మాత్రం ఆమె దేశ రాజకీయాల్లో డేగ అయింది! చావెజ్ మరణాంతరం వచ్చిన నికొలస్ మోరోస్‌ను దేశాన్ని నియంతృత్వ పోకడలతో పాలిస్తుండగా ఆయనను డేగలా వేటాడి వేటాడి ఆయనకు కంట కునుకు లేకుండా చేసింది.
పోరాటాల పోరుకు జడిసిన భర్త.. దూరంగా పిల్లలు..
మరియ దేశ ప్రజలే తన కుటుంబం అనుకున్నారు. కుటుంబానికి ప్రాణహాని ఉందంటే ఎవరైనా సరే పోరాటాన్ని ఆపేస్తారు. కానీ ఆమె మాత్రం అలాంటి పని చేయలేదు. దీంతో ఈ పోరాటాల కారణంగా ఆమెను తన భర్త వదిలేశారు. మరియకు ముగ్గురు పిల్లలు.. ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. దేశంలో ఉన్న పరిస్థితుల కారణంగా మరియ వారి భద్రత కోసం విదేశాలకు పంపించారు. వారు ఏ దేశంలో ఉన్నారనేది కేవలం ఆమెకు తప్ప ఎవరికీ తెలియదు.
ఆమె వెన్నంటే.. ప్రజలు
దేశంలో కొనసాగుతున్న నిరంకుశ పాలనపై ప్రజలు ఎవరు కూడా సంతోషంగా లేరని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో దేశంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె రోడ్లపైకి వచ్చినప్పుడల్లా … వేలాదిగా ప్రజలు ఆమెను కలవడానికి వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆ ఎన్నికల సమయంలో ఆమె ప్రజల దగ్గరకు వెళ్లటం అటుంచితే, ప్రజలే సచ్ఛందంగా ఆమె వెన్నంటి నడవటం ప్రారంభించారు. దేశంలో ఆమెకు పెరిపోతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక అప్పటి వెనిజులా ప్రభుత్వం ఆమెకు అంగరక్షకుల్ని తొలగించింది. నిరంకుశ పాలకుడిగా మారిన ఆ దేశ అధ్యక్షుడు నికొలస్, కొన్నేళ్లుగా ఆమెపై వ్యతిరేకంగా అనేక కేసులు పెట్టించారు, కోర్టుకు ఈడ్చారు, భౌతిక దాడులు చేయించారు. అయినా ఆమె వెనకంజ వేయకుండా, నికొలస్ ఆర్థిక విధానాలతో నిరుపేద దేశంగా మారిన ఈ చమురు నిక్షేపాల సంపన్న దేశాన్ని ఒడ్డున పడేయటానికి ప్రభుత్వంతో పెద్ద యుద్ధమే చేస్తున్నారు.
ఆమె పోరాటానికి దాసోహం అయిన నోబెల్ శాంతి బహుమతి..
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి తనకు రావాల్సిందే అని పట్టుబట్టుకొని కూర్చొన్నారు. సందర్భం దొరికిన ప్రతీసారి ఆయన ప్రపంచ వేదికలపై తాను ఇప్పటి వరకు ఎనిమిది యుద్ధాలను ఆపనని చెప్పడం ప్రారంభించారు. పలువురు విశ్లేషకులు ఏకంగా ఆయన నోబెల్ శాంతి బహుమతి ప్రకటించే కమిటిని కూడా బెదిరింపులు దిగారని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయినా శాంతి కమిటి ఆయనకు తలొగ్గకుండా వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు, ఆదేశ ఉక్కు మహిళ అయిన మరియ కోరినా మచాదోకు ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి వరించినట్లు వెల్లడించింది. అగ్రరాజ్యాధిపతిని ఉక్కు మహిళ మట్టికరిపించిందని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
READ ALSO: Nobel Peace Prize 2025: పాపం ట్రంప్.. నోబెల్ శాంతి బహుమతి ఎవరికి వచ్చిందో తెలుసా!
