Vemulawada Temple: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులకు నాసిరకం లడ్డూల అమ్మకాలు కొనసాగించడంతో పలు విమర్శలకు తావిస్తోంది. రెండు రోజుల క్రితం తయారుచేసిన లడ్డూల్లో తేమ అరకపోవడం, బూజు పట్టిన లడ్డూలనే అమ్ముతున్నారు. పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదం తీసుకున్న తర్వాత వాటి నుంచి వాసన రావడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే, గోదాం నుంచి తీసుకువచ్చే లడ్డు ట్రైలలో సైతం దుర్వాసన వస్తు్న్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ సందర్భంగా పట్టణ బీజేపీ అధ్యక్షుడు శ్రీధర్ మాట్లాడుతూ.. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డుల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా అధికారుల చర్యలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రసాదాల తయారీలో నిర్లక్ష్యం వీడి భక్తులకు పవిత్రంగా అందించాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. ఈ ఘటనపై ఆలయ ఏఈఓ శ్రీనివాస్ స్పందించారు. గత రెండు రోజులుగా వర్షాభావ పరిస్థితులతో కొన్ని ట్రేలలో లడ్డులు ఆరలేదన్నారు. దీంతో తేమ వచ్చిందని, వెంటనే వాటిని తీసివేసామన్నారు.
READ MORE: S. Jaishankar: తాలిబన్ విదేశాంగ మంత్రితో జైశంకర్ కీలక భేటీ.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు
