Vemulawada : దశాబ్దకాలంగా వాయిదా పడుతూ వచ్చిన వేములవాడ పట్టణంలోని రోడ్ వెడల్పు పనులకు ఆదివారం అధికారులు ప్రారంభసూచి ఇచ్చారు. మటన్ మార్కెట్ ప్రాంతంలో ఉన్న మున్సిపల్ దుకాణాలను అధికారుల పర్యవేక్షణలో జేసీబీలతో కూల్చివేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి చర్యలు చేపట్టారు. తిప్పాపూర్ బ్రిడ్జి నుంచి శ్రీ రాజన్న ఆలయం వరకు రోడ్డును 80 అడుగుల వెడల్పుతో విస్తరించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం రూ.47 కోట్లు మంజూరు చేసింది. మొత్తం 260 నిర్వాసితులలో ఇప్పటికే సుమారు 70 మందికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెక్కులు అందజేశారు.
Kakumanu Rajasekhar: ఎంత అణిచి వేయాలని చూస్తే.. అంత పెద్దగా ఎదుగుతాం!
బాధితులకు ఇళ్లను ఖాళీ చేయాలన్న నోటీసులు 15 రోజుల క్రితమే జారీ చేయగా, కొంతమంది కోర్టు శరణు పొందారు. మిగతా ఇళ్లు త్వరలోనే కూల్చనున్నారు. మొత్తం 322 స్ర్టక్చర్స్ ఉండగా, నిర్వాసితులందరూ సహకరించాలని వేములవాడ ఆర్డీఓ రాధాబాయి విజ్ఞప్తి చేశారు. రోడ్ వెడల్పు జరుగుతున్న ప్రదేశం పరిధిలో భద్రతా దృష్ట్యా సోమవారం ఉదయం 6 గంటల నుంచి 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్‌ను అధికారులు అమలు చేశారు. ఈ రోడ్ వెడల్పుతో వేములవాడ పట్టణంలో ట్రాఫిక్ సమస్యలపై పలు సంవత్సరాలుగా ఉన్న అసౌకర్యాలు తొలగిపోవనున్నాయి.
Census: జనాభా లెక్కల నోటిఫికేషన్ విడుదల.. తొలుత ఏఏ రాష్ట్రాల్లో అంటే..!
