Site icon NTV Telugu

Rajanna Sircilla: వేములవాడ రాజన్న ఆలయం మూసివేత.. ఎందుకంటే?

Rajanna

Rajanna

దక్షిణ కాశీగా వెలుగొందుతున్న వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తుంటారు. కోడె మొక్కులు తీర్చుకుని తమ కష్టాలను తీర్చమని శివయ్యను వేడుకుంటారు. అయితే రాజన్న ఆలయాన్ని మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. ఎందుకంటే?.. ఈనెల 7న చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయం మూసివేయనున్నట్లు తెలిపారు. 7వ తేది ఆదివారం ఉదయం 11.25 గంటల నుంచి 8వ తేది సోమవారం ఉదయం తెల్లవారు జామున ఉదయం 3.45 గంటల వరకు ఆలయ మూసివేయనున్నట్లు ఆలయ అర్చకులు వెల్లడించారు. గ్రహణం అనంతరం 8న ఉదయం 4 గంలకు ఆలయ సంప్రోక్షణ, స్వామివారికి ప్రాతఃకాల పూజల అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ రెండు రోజులపాటు భక్తులచే నిర్వహించే ఆర్జిత సేవలను రద్దు చేశారు ఆలయ అధికారులు.

Exit mobile version