NTV Telugu Site icon

2024 Dussehra Offer: రూ.100 కొట్టు మేకను పట్టు.. దసరాకు బంపర్ ఆఫర్! ఎక్కడో తెలుసా

Velmakanne Village Dussehra Scheme

Velmakanne Village Dussehra Scheme

2024 Dussehra Scheme in Velmakanne Village: తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండగ ‘దసరా’. ఈ పండుగకు వస్త్ర, నగల వ్యాపార సంస్థలు భారీగా ఆఫర్లను పెడుతూ కస్టమర్లను ఆకర్షిస్తుంటారు. ప్రతి దసరాకు ఇది సర్వసాధారణమే. అయితే ఓ గ్రామంలోని యువకులు వినూత్నంగా ఆలోచించి ఓ స్కీమ్‌ను పెట్టారు. 2024 దసరాకు బంపర్ ఆఫర్ అంటూ.. ‘రూ.100 కొట్టు మేకను పట్టు’ అనే స్కీమ్ పెట్టారు. స్కీమ్‌లో ఐదు బహుమతులను కూడా అందించనున్నారు. ఆ బహుమతులే ఇక్కడ వీరిని వార్తల్లో నిలిచేలా చేశాయి.

నల్గొండ జిల్లా మునుగోడు మండలంలోని వెల్మకన్నె గ్రామంలోని మరికొందరు యువకులు దసరా పండగ కోసం ‘రూ.100 కొట్టు మేకను పట్టు’ అనే స్కీమ్ పెట్టారు. గ్రామస్తుల కోసం ఒక్కో కూపన్ ధర రూ.100గా నిర్ణయించారు. త్వరలోనే కూపన్‌లను గ్రామస్తులకు అందుబాటులో ఉంచనున్నారు. అక్టోబర్ 12న దసరా పండగా కాగా.. అక్టోబర్ 10న సాయంత్రం 6 గంటలకు డ్రా తీస్తారు. బస్ స్టాండ్ దగ్గర ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిన్న పిల్లతో డ్రా తీసి విజేతలకు ప్రకటిస్తామని ఓ బ్యానర్ కట్టారు.

Also Read: Gold Rate Today: పసిడి ప్రియులకు భారీ షాక్.. ఆల్‌టైమ్ గరిష్టాలను దాటేసిన గోల్డ్ రేట్లు!

మొదటి బహుమతిగా 10 కిలోల మేకను ప్రకటించారు. రెండో బహుమతిగా రెండు బ్లెండర్స్ ప్రైడ్ ఫుల్ బాటిల్స్, మూడో బహుమతిగా కాటన్ బీర్లు, నాలుగో బహుమతిగా రెండు నాటు కోళ్లు, ఐదో బహుమతిగా ఒక రాయల్ స్టాగ్ ఫుల్ బాటిల్ అందించనున్నట్లు వెల్మకన్నె యువకులు తెలిపారు. ఇందుకు సంబందించిన బ్యానర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో లక్కీ డ్రా పేరుతో పలు స్కీమ్‌లు పెట్టారు. అందులో ద్విచక్ర వాహనాలు, ప్రెజర్ కుక్కర్, ఇంట్లో వంట సామాగ్రిలను బహుమతిగా ఇచ్చేవారు. ఇప్పుడు చుక్క, ముక్క అంటూ బహుమతులు ఇస్తున్నారు.