Kidney Stones: కిడ్నీలో రాళ్ల సమస్య అనేది ఎంతో ఒకరకంగా తీవ్రమైన వ్యాధిగా పరిగణించవచ్చు. కిడ్నీలో రాళ్ల వల్ల కలిగే నొప్పిని అనుభవించినవారికి మాత్రమే దీని తీవ్రత తెలుసు. ప్రస్తుతం కాలంలో రాళ్ల సమస్య సాధారణంగా మారిపోయింది. దీని ప్రధాన కారణాలు మన జీవనశైలి, తినే ఆహారం. కిడ్నీ రాళ్ల సమస్య నుంచి దూరంగా ఉండాలంటే మనం తగినంత నీటిని త్రాగడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే, కొన్ని కూరగాయలు రాళ్ల సమస్యను పెంచుతాయి. అవేంటో తెలుసుకుందాం.
Also Read: SA20 2025: SA20 టీ20 లీగ్‌కు సర్వం సిద్ధం.. మ్యాచ్‌లను ఎక్కడ చూడచ్చంటే?
పాలకూర:
పాలకూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ ఎక్కువగా తినడం మాత్రం మంచిది కాదు. పాలకూరలో ఆక్సలేట్ అధికంగా ఉంటుంది. ఈ ఆక్సలేట్ కిడ్నీలో రాళ్లను ఏర్పడేందుకు కారణం అవుతుంది. కాబట్టి ఇప్పటికే కిడ్నీలో రాళ్లు ఉన్నవారు లేదా రాళ్లు రాకుండా జాగ్రత్త పడేవారు పాలకూరను మితంగా తినడం మంచిది.
వంకాయ:
వంకాయలో పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. అయితే, వీటితో పాటు వంకాయలో కూడా ఆక్సలేట్ అధికంగా ఉంటుంది. ప్రత్యేకంగా వంకాయ గింజలలో ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా వంకాయ తినడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది.
టమోటా:
ప్రతి రోజూ మన వంటకాలలో వాడే టమోటాలో ఆక్సలేట్ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా టమోటా గింజలలో ఇది ఎక్కువగా ఉంటుంది. రోజూ ఎక్కువగా టమోటా తినడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్యకు దారి తీస్తుంది.
Also Read: Group 3 Preliminary Key: గ్రూప్-3 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ప్రిలిమినరీ కీ రిలీజ్
దోసకాయ లేదా కీరదోస:
సలాడ్‌లో ఎక్కువగా వాడే దోసకాయ, కీరదోస ఆరోగ్యానికి మంచివే. కానీ వీటిని అధికంగా తినడం కిడ్నీలో రాళ్ల సమస్యకు దారితీస్తుంది. వీటి గింజలలో ఆక్సలేట్ అధికంగా ఉండటం వల్ల కిడ్నీలో ప్రమాదం ఎక్కువ అవుతుంది.
ఆలుగడ్డ, సోయాబీన్:
“నేషనల్ కిడ్నీ ఫౌండేషన్” నివేదిక ప్రకారం.. రోజూ తినే కూరగాయలలో కొన్ని కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి కారణమవుతాయి. అలాంటి కూరగాయలలో ఆలుగడ్డ, సోయాబీన్ కూడా ఉన్నాయి. వీటిని అధికంగా తినడం కిడ్నీ ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. కాబట్టి, ఇప్పటికే రాళ్ల సమస్య ఉన్నవారు వీటిని మితంగా తీసుకోవడం మంచిది.