Site icon NTV Telugu

Vegetable Prices: కూరగాయల ధరలు పైపైకి.. రెండు వారాల్లో 30-60 శాతం పెరుగుదల..

Vegetable Prices

Vegetable Prices

Vegetable Prices: కూరగాయల ధరలు క్రమంగా కొండెక్కుతున్నాయి.. 2-3 వారాల వ్యవధిలోనే ఏకంగా 30 శాతం నుంచి 60 శాతం మేర పెరగడంతో.. సామాన్యులు కూరగాయలు కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.. డిమాండ్‌కు తగ్గట్టు ఉత్పత్తి లేకపోవడంతో కూరగాయలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ ఏడాది వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో కూరగాయల ఉత్పత్తి తగ్గిపోగా.. డిమాండ్ పెరిగి ధరలు భగ్గుమంటున్నాయి. రేట్లు పెరగడంతో సామాన్యులతో పాటు వ్యాపారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు వర్షాలతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు సంభవించగా.. కూరగాయలు త్వరగా కుళ్లిపోతుండడంతో వ్యాపారస్తులు దిగుమతులను క్రమంగా తగ్గించగా.. రాష్ట్రంలో కూరగాయల సాగు కూడా తగ్గింది. వీటి ప్రభావంతో ప్రస్తుతం మార్కెట్‌లో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి.

Read Also: ధర్మారెడ్డికి బై బై.. టీటీడీ కొత్త ఈఓగా శ్యామలరావు.(వీడియో)

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఈ పరిస్థితే ఉంది.. ఇక, తూర్పుగోదావరి జిల్లాలోనూ ‘భారీగా పెరిగాయి కూరగాయల ధరలు.. కూరగాయల ధరలు 2-3 వారాల వ్యవధిలోనే 30-60 శాతం పెరడంపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. కూరగాయల పంటల సాగు కొని లక్షల ఎకరాలకే పరిమితమవడం, ఉత్పత్తి తగ్గడమే ధరలు పెరుగుదలకు కారణంగా విశ్లేస్తున్నారు.. ఇక, మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ.40-50కి చేరగా.. టమాటా ధర రూ. 60-90గా ఉంది, వంకాయ రూ.40-50 పలుకుతుండగా.. పచ్చి మిర్చి రూ.80-120కి పెరగడంతో.. మార్కెట్‌కు వెళ్లాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.. ఇక, బీన్స్, క్యారట్, బీట్రూట్, క్యాప్సికం, కాకరకాయ, పుదీనా, కొత్తిమీర ఇలా అన్నింటి ధరలు రెట్టింపు కావడంతో.. క్రమంగా వంట గదిలో కూరగాయాలు మాయం అవుతున్నాయి.

Exit mobile version