NTV Telugu Site icon

Vegasri Gold and Diamonds: ప్రముఖ నటి ప్రగ్యా జైస్వాల్ చేతుల మీదుగా వేగశ్రీ లక్స్ ప్రారంభం

Vegasri Gold

Vegasri Gold

Vegasri Gold and Diamonds: వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇప్పటికే అత్యుత్తమ జ్యూవెలరీగా ప్రపంచంలో ప్రసిద్ధి చెందింది. వేగశ్రీ గోల్డ్ అండ్‌ డైమండ్స్‌కు ఇటీవలే నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్‌ బ్రాండ్‌ అంబాసిడర్లుగా ఎంపికైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జ్యూవెలరీ గురించి అంతటా మంచి టాక్‌ నడుస్తోంది. ఇప్పుడు మరో అతి అద్భుతమైన ఆభరణములతో ఆడవారి మనస్సు దోచే మరో ఆభరణముల ప్రపంచాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అదే వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ (లక్స్‌)ని ప్రముఖ నటి ప్రగ్యా జైస్వాల్ చేతులమీదుగా మార్చి 31న ఉదయం 11.00 గంటలకు హైదరాబాద్‌లో ప్రారంభించారు.

Read Also: woman living atop snow: మంచు పర్వతమే ఆమె నివాసం.. మహిళలందరికీ ఆదర్శం

ఆమె చేతుల మీదుగా ఈ జ్యువెలర్స్ ప్రారంభమైనందుకు ఎంతో గర్వంగా ఉందని వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ ఛైర్మన్ వనమ నవీన్, ఎండీ మణిదీప్, కళ్యాణ్ కుమార్ గోళ్ల, శ్రీనివాస్, సుధాకర్‌లు తెలిపారు. ఈ ప్రారంభంతో ఆడవారి మనస్సు దోచె బంగారం, వజ్రాలు, పోల్కి కుందన్, విక్టోరియన్ ఆభరణములను అబ్బుర పరిచే శ్రేణిలో కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని వారు వెల్లడించారు. కాగా.. బాలకృష్ణ చేతుల మీదుగానే ఈ షోరూమ్ ప్రారంభం జరుపుకోవాల్సి ఉండగా.. ఆయన ఐపీఎల్ కామెంటరీలో బిజీగా ఉండటంతో మరో బ్రాండ్ అంబాసిడర్ అయిన ప్రగ్యా జైస్వాల్ ప్రారంభించారని వారు స్పష్టం చేశారు.

Show comments