Ugadi 2024: ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టిన వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. రాష్ట్రాన్ని మరోసారి కలియతిరిగే పనిలో పడిపోయారు.. అయితే, ఉగాది పర్వదినం సందర్భంగా.. ఈ రోజు తన బస్సు యాత్రకు విరామం ఇచ్చారు.. అయితే, తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, వైఎస్ భారతి దంపతులకు వేద పండితుల ఆశీర్వచనం చేశారు.. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా.. సోమవారం రోజు పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం గంటావారిపాలెంలో బస చేశారు సీఎం జగన్.. ఇక, ఆ నైట్ స్టే పాయింట్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులకు ఆశీర్వచనం ఇచ్చిన పండితులు.. శాలువా కప్పి, అక్షింతలు చల్లి ఆశీర్వాదం ఇచ్చి.. ఆ తర్వాత వారికి ఉగాది పచ్చడి ఇచ్చారు. పండితులు అందించిన ఉగాది పచ్చడిని సీఎం దంపతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు అనిల్ కుమార్ యాదవ్, బొల్లా బ్రహ్మనాయుడు, లేళ్ల అప్పిరెడ్డి సహా తదితర నేతలు పాల్గొన్నారు.
Read Also: Love Mouli Trailer: నవదీప్ ‘లవ్ మౌళి’ ట్రైలర్.. బోల్డ్ కంటెంట్ బోలెడుంది!
కాగా, ఉగాది సందర్భంగా ఏపీ ప్రజలకు సీఎం వైఎస్ జగన్ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపిన విషయం విదితమే.. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన.. ‘రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు.. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో నా అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వాతాతలు, విద్యార్థులు అందరికీ మంచి జరిగి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను.’ అంటూ ట్విట్టర్‌లో (ఎక్స్)లో ఓ పోస్టు పెట్టారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్..