NTV Telugu Site icon

Varuntej and Lavanya Tripathi: వరుణ్-లావణ్యల పెళ్లి ఇటలీలోనా?

Lavanya Varuntej Marriage

Lavanya Varuntej Marriage

మెగా బ్రదర్ నాగబాబు కూమరుడు వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం శుక్రవారంనాడు కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది. నాగబాబు ఇంట్లోనే ఈ వేడుకను నిర్వహించారు..ఈ కార్యక్రమానికి నాగబాబు తల్లి అంజనా దేవి, చిరంజీవి దంపతులు,పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కుటుంబం, అల్లు అరవింద్ కుటుంబం, అల్లు అర్జున్ కుటుంబం, అల్లు బాబీ కుటుంబం, అల్లు శిరీష్, డాక్టర్ వెంకటేశ్వరరావు కుటుంబం, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సుస్మిత, శ్రీజ, ఇతర బంధువులు హాజరయ్యారు..

Read Also:Karnataka : భర్తపై భార్య అత్యాచారం కేసుపై స్టే విధించిన హైకోర్టు..

ఇక వీరిద్దరి ఎంగేజ్మెంట్ కు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వీరిపై వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. కాగా, ఎంగేజ్మెంట్ ఫోటోలను లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 2016 నుంచి మేము ప్రేమించుకుంటున్నామంటూ పలు ఆసక్తికరమైన విషయాలను పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో నిశ్చితార్థంలో వీరిద్దరూ చాలా ఖరీదైన ఉంగరాలు తొడిగినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఒక్కో ఉంగరం ఖరీదు రూ..12 లక్షలు పైగానే, మొత్తం కలిపి రూ.25 లక్షలు ఉండవచ్చునని అంచనా.. అలాగే వీరు వేసుకున్న డ్రెస్సులు వరుణ్ రూ .2 లక్షల విలువైన కూర్త పైజామా, లావణ్య త్రిపాఠి రూ .3 విలువైన బెనారస్ సారి కట్టుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..

Read Also:Women Health Tips : పీరియడ్స్ టైంలో మహిళలు ఈ ఆహారాలను అస్సలు తినకండి..

ఇప్పుడు మరో వార్త షికారు చేస్తుంది.. నిన్నటివరకు వీరిద్దరి పెళ్లిని రాజస్థాన్ లోని రాయల్ ఫాలెస్ లో చెయ్యాలని నాగబాబు నిర్ణయించినట్లు వార్తలు వినిపించాయి.. ఇప్పుడు తాజాగా మరో వార్త బయటకు వచ్చింది.. వీరిద్దరి డెస్టినేషన్ ప్రకారం ఇటలీలో పెళ్లి జరగనుందని వార్త వైరల్ అవుతుంది.. అక్కడ పెళ్లిని గ్రాండ్ చేసి, ఇక్కడ రీసెప్షన్ ను కూడా గ్రాండ్ గా నిర్వహించే ఆలోచనలో మెగా కుటుంబం ఉన్నట్లు సమాచారం.. ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే కొన్ని నెలలు ఆగాల్సిందే.. కాగా,వరుణ్ తేజ్ ప్రస్తుతం గాండీవ దారి అర్జున అనే చిత్రంలో నటిస్తూ ఉన్నారు. లావణ్య త్రిపాఠి వివాహమైన తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

Show comments