మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్.వరుణ్ తేజ్ 13 వ మూవీ గా వస్తున్న ఈ మూవీని వార్ డ్రామా నేపథ్యంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (భారత వైమానిక దళం)కు నివాళులర్పిస్తూ తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా కథాంశం తో వస్తున్న ఈ మూవీలో మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటిస్తోంది. శక్తి ప్రతాప్ సింగ్ హడ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఫైటర్ పైలట్ గా నటిస్తుండగా.. మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్ గా నటిస్తుంది.కాగా ఈ చిత్రాన్ని ముందుగా అనుకున్న ప్రకారం ఫిబ్రవరి 16 న విడుదల చేయాల్సింది. కానీ తాజా సమాచారం ఈ మూవీని రీషెడ్యూల్ చేశారు. లేటెస్ట్ టాక్ ప్రకారం ఫిబ్రవరి 23 లేదా మార్చి 1 న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
యాడ్ ఫిల్మ్ మేకర్, సినిమాటోగ్రఫర్ మరియు వీఎఫ్‌ఎక్స్ స్పెషలిస్ట్ శక్తి ప్రతాప్ సింగ్ హడ డైరెక్ట్ చేస్తుండటం తో సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి.యదార్థ సంఘటనల స్పూర్తితో తెలుగు మరియు హిందీ బై లింగ్యువల్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మన ఎయిర్‌ఫోర్స్ ను ఇంకో దేశంలోకి పంపించడమంటే.. యుద్ధాన్ని ప్రకటించడమే.. అంటూ సాగే టీజర్ రెండు భాషల్లో 20 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టింది..ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్-రెనాయ్‌సెన్స్ పిక్చర్స్ బ్యానర్ల పై సందీప్ ముద్ద మరియు నందకుమార్ అబ్బినేని తెరకెక్కిస్తున్నారు. వరుణ్ తేజ్ మరోవైపు పలాస 1978 ఫేం కరుణకుమార్ దర్శకత్వం లో మట్కా అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది.
Update on #OperationValentine: The release date for Mega Prince #VarunTej's patriotic thriller has been rescheduled , Fans can expect the film to hit screens on either February 23rd or March 1st. @IAmVarunTej @sonypicsfilmsin @RenaissancePicz pic.twitter.com/cO0Jt720PB
— BA Raju's Team (@baraju_SuperHit) January 31, 2024