Varun Tej: కొరియాలో బిజీగా కనకరాజు

Varun Tej

Varun Tej

Varun Tej: మెగా హీరో వరుణ్ తేజ్ సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలమైంది. ప్రస్తుతానికి ఆయన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్ మరియు ఫస్ట్ ప్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘కొరియన్ కనకరాజు’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన షెడ్యూల్ తాజాగా కొరియాలో ప్రారంభమైంది. కొరియన్, ఇండియన్ బ్యాక్‌డ్రాప్స్‌లో రూపొందిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఒక పూర్తి స్థాయి కొత్త గెటప్‌లో కనిపించబోతున్నారు. ఇక ఈ కొరియా షెడ్యూల్ ఒక వారం పాటు సాగనుందని అంటున్నారు. ఈ షెడ్యూల్‌లో కొన్ని సీన్స్‌తో పాటు సాంగ్స్ కూడా షూట్ చేసే అవకాశం ఉంది.

చిన్నారుల భద్రత కోసం WhatsApp కొత్త ఫీచర్.. 13 ఏళ్లలోపు పిల్లల కోసం ‘పేరెంట్ మేనేజ్‌డ్ అకౌంట్స్’ షురూ..!

×
×
Ad

ఇందులో వరుణ్ తేజ్, రితికా నాయక్ తో పాటు సత్య కూడా భాగం కానున్నారు. నిజానికి ‘కొరియన్ కనకరాజు’ టైటిల్ రివీల్ చేసినప్పటి నుంచే ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమా మీద ప్రేక్షకులలో అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలను రెట్టింపు చేసేలా మరిన్ని ప్రమోషన్స్ రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వీలైనంత త్వరగా షూట్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించాలని యూనిట్ భావిస్తోంది. అవి పూర్తయ్యాక సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తోంది.

LPG Supply: గ్యాస్‌ ఆన్‌లైన్‌ బుకింగ్ మాత్రమే జరగాలి.. బ్లాక్ మార్కెటింగ్‌కి చోటు లేదు..