Site icon NTV Telugu

Matka : మొదలైన వరుణ్ తేజ్ మట్కా షూటింగ్.. వైరల్ అవుతున్న షూటింగ్ పిక్..

Whatsapp Image 2023 12 14 At 10.28.30 Pm

Whatsapp Image 2023 12 14 At 10.28.30 Pm

టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్‌ తేజ్‌ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ మట్కా. ఈ మూవీని పలాస 1978 ఫేం కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. మట్కా చిత్రాన్ని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. కాగా వరుణ్‌తేజ్‌ వెడ్డింగ్ నేపథ్యంలో తాత్కాలికంగా బ్రేక్‌ పడ్డ మట్కా షూటింగ్‌ మళ్లీ షురూ అయింది. కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు హైదరాబాద్‌ సరిహద్దుల్లో స్పెషల్ సెట్‌ వేసినట్టు తెలియజేస్తూ మేకర్స్‌ అప్‌డేట్ అందించారు.మానిటర్‌లో డైరెక్టర్‌ సీన్ చెక్ చేసుకుంటున్న స్టిల్‌తో షేర్ చేసిన మట్కా షూటింగ్ నయా అప్‌డేట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమా వరుణ్ తేజ్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో పీరియాడిక్ బ్యాక్‌ డ్రాప్ స్టోరీతో తెరకెక్కుతోంది. ఈ మూవీలో వరుణ్ తేజ్‌ నాలుగు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించబోతున్నాడని సమాచారం.. ఈ చిత్రంలో నోరాఫతేహి కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది.

వరుణ్ తేజ్‌ మట్కా మూవీ తో పాటు వార్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న “ఆపరేషన్‌ వాలెంటైన్‌” అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. VT13గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడ దర్శకత్వం వహిస్తున్నారు.. వరుణ్‌ తేజ్‌ ఈ మూవీతోనే బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తున్నాడు. అయితే ఆపరేషన్‌ వాలెంటైన్‌ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 న విడుదల కానుంది..ఈ మూవీ లో వరుణ్‌ తేజ్‌ ఫైటర్‌ పైలట్‌గా నటిస్తుండగా మాజీ మిస్ యూనివర్స్‌ మానుషి ఛిల్లార్ హీరోయిన్ గా నటిస్తోంది.యదార్థ సంఘటనల ఆధారంగా వస్తోన్న ఈ మూవీని ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్ (భారత వైమానిక దళం)కు నివాళిగా తెరకెక్కిస్తున్నారు. తెలుగు, హిందీ బై లింగ్యువల్ మూవీ గా వస్తున్న ఈ సినిమాను సోనీ పిక్చర్స్-రెనాయ్‌సెన్స్ పిక్చర్స్ బ్యానర్లపై సందీప్ ముద్ద మరియు నందకుమార్‌ అబ్బినేని ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.

Exit mobile version