Matka : మొదలైన వరుణ్ తేజ్ మట్కా షూటింగ్.. వైరల్ అవుతున్న షూటింగ్ పిక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ మట్కా. ఈ మూవీని పలాస 1978 ఫేం కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. మట్కా చిత్రాన్ని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. కాగా వరుణ్‌తేజ్ వెడ్డింగ్ నేపథ్యంలో తాత్కాలికంగా బ్రేక్ పడ్డ మట్కా షూటింగ్ మళ్లీ షురూ అయింది. కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు హైదరాబాద్ సరిహద్దుల్లో స్పెషల్ సెట్ వేసినట్టు తెలియజేస్తూ మేకర్స్ అప్‌డేట్ అందించారు.మానిటర్‌లో డైరెక్టర్ సీన్ చెక్ చేసుకుంటున్న స్టిల్‌తో షేర్ చేసిన మట్కా షూటింగ్ నయా అప్‌డేట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమా వరుణ్ తేజ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కుతోంది. ఈ మూవీలో వరుణ్ తేజ్ నాలుగు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించబోతున్నాడని సమాచారం.. ఈ చిత్రంలో నోరాఫతేహి కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది.
వరుణ్ తేజ్ మట్కా మూవీ తో పాటు వార్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న “ఆపరేషన్ వాలెంటైన్” అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. VT13గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ హడ దర్శకత్వం వహిస్తున్నారు.. వరుణ్ తేజ్ ఈ మూవీతోనే బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తున్నాడు. అయితే ఆపరేషన్ వాలెంటైన్ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 న విడుదల కానుంది..ఈ మూవీ లో వరుణ్ తేజ్ ఫైటర్ పైలట్‌గా నటిస్తుండగా మాజీ మిస్ యూనివర్స్ మానుషి ఛిల్లార్ హీరోయిన్ గా నటిస్తోంది.యదార్థ సంఘటనల ఆధారంగా వస్తోన్న ఈ మూవీని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (భారత వైమానిక దళం)కు నివాళిగా తెరకెక్కిస్తున్నారు. తెలుగు, హిందీ బై లింగ్యువల్ మూవీ గా వస్తున్న ఈ సినిమాను సోనీ పిక్చర్స్-రెనాయ్‌సెన్స్ పిక్చర్స్ బ్యానర్లపై సందీప్ ముద్ద మరియు నందకుమార్ అబ్బినేని ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.
Also Read
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
The much-anticipated shoot of Mega Prince @IAmVarunTej's #MATKA began today❤️🔥
A Massive set has been erected on the outskirts of Hyderabad to shoot some crucial scenes🔥
More Updates soon!@KKfilmmaker #Norafatehi @Meenakshiioffl @gvprakash @drteegala9 @mohan8998 @VyraEnts pic.twitter.com/Qm8ohQn7nT
— Vyra Entertainments (@VyraEnts) December 14, 2023
- Tags
- Matka
- shooting start
- VarunTej
తాజావార్తలు
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
-
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!