NTV Telugu Site icon

Varun Tej: పిఠాపురంలో బాబాయికి అండగా అబ్బాయి ప్రచారం..

Varuntej Pitapuram

Varuntej Pitapuram

ఏపీలో ఎన్నికల వేడి బాగా కొనసాగుతుంది. అన్ని రాజకీయ పార్టీలు తమదైన శైలిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. పవన్ తరపున ఇప్పటికే పలువురు సినీ నటులు ప్రచారం చేసారు. అందులో హైపర్ ఆది, గెటప్ శీను, డ్యాన్స్ మాస్టర్ తదితరులు కూడా పవన్ తరపున ప్రచారం చేసారు.

Also read: Mobile Internet: ఫోన్‌లో ఇంటర్నెట్‌ స్లోగా వస్తోందా.. అయితే ఇలా చేయండి..

పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు తనయుడు, నటుడు వరుణ్ తేజ్ శనివారం పిఠాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులతో కలిసి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో రోడ్‌ షోలో పాల్గొని ప్రసంగించారు.

Also read: Crime Case: ఇదెక్కడి మాస్ మావా.. సినిమా రేంజిలో పోలీసుల స్కెచ్.. ముఠా గుట్టు రట్టు..

బాబాయ్ పవన్ కళ్యాణ్‌కు మద్దతు ఇచ్చేందుకు కుటుంబ సభ్యులందరూ తన వెంట ఉంటామని వరుణ్ తేజ్ మీడియాకు తెలిపారు. సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాబాయ్ పవన్ కళ్యాణ్ ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాలను ఎంచుకున్నట్లు చెప్పారు. బాబాయిపై ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలపై వరుణ్ తేజ్ స్పందిస్తూ.. వారు నిజాయితీ కోసం ప్రయత్నించరని అన్నారు. ఓ వైపు సినిమా చిత్రీకరణ సమయంలోనే మేము బాబాయ్ పవన్ కళ్యాణ్ తరపున ప్రచారంలో పాల్గొంటామని వెల్లడించాడు.