Site icon NTV Telugu

Varun Sandesh: రెండో సినిమాకే డైరెక్టర్ గా మారిన హీరోయిన్

Shagna Sri

Shagna Sri

Varun Sandesh: ఒక సినిమాలో హీరోయిన్ గా నటించిన ఓ భామ రెండో సినిమాకి డైరెక్టర్ గా మారింది. వరుణ్ సందేశ్ హీరోగా ఎస్ 2ఎస్ సినిమాస్ ఈ రోజు క్రిస్మస్ సందర్భంగా తమ ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రాన్ని అనౌన్స్ చేసింది. శ్సాస్ ప్రొడక్షన్స్ ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల చిత్రంతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న షగ్న శ్రీ వేణున్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తూ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు నటిస్తున్నారు.

READ ALSO: Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందువు హత్య..

ఈ రోజు రిలీజ్ చేసిన మూవీ పోస్టర్లో ఒక బ్లాక్ డ్రెస్ ధరించిన యువ జంట చేతిలో రోజా పూలతో ఉండటం, మరో యువకుడు ఈ జంటలోని యువతి చేయి పట్టుకుని కనిపిస్తుండటం ఆసక్తి కలిగిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మార్చిలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు.

READ ALSO: Philippines: ఈ దేశంలో నాలుగు నెలల పాటు క్రిస్మస్ వేడుకలు.. ఆ దేశం ఏదో తెలుసా!

Exit mobile version