NTV Telugu Site icon

Nindha: వరుణ్ సందేశ్ మీద ‘నింద’ పోయేదెలా.. టీజర్ కట్ అదిరింది!

Nindha Teaser

Nindha Teaser

Varun Sandesh Nindha Teaser Released: కాండ్రకోట మిస్టరీ అనే యధార్థ సంఘటన ఆధారంగా ‘నింద’ అనే చిత్రం రాబోతోంది. కొత్తబంగారు లోకం సినిమాతో ఒక్కసారిగా కుర్రకారుని ఆకట్టుకున్న వరుణ్ సందేశ్ ఈ సినిమాలో హీరోగా నటించారు. ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మించిన ఈ మూవీని రాజేష్ జగన్నాథం నిర్మించడమే కాకుండా కథ, కథనాలు అందిస్తూ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేయగా తాజాగా ఈ మూవీ టీజర్‌ను విలక్షణ నటుడు నవీన్ చంద్ర విడుదల చేశారు. టీజర్ విడుదల చేసిన అనంతరం చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ‘జీవితంలో కొన్ని సార్లు తప్పని తెలిసినా చేయక తప్పదు’.. అనే డైలాగ్‌తో మొదలైన ఈ టీజర్‌లో ఎన్నో కోణాలున్నాయి.

Preminchoddhu: బేబీ పోలిన కథతోనే ప్రేమించొద్దు.. ఆసక్తి రేపుతున్న టీజర్

అందమైన ప్రేమ కథతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ కూడా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఈ టీజర్‌లోని విజువల్స్ ఎంతో న్యాచురల్‌గా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆర్ఆర్ అయితే మూడ్‌కు తగ్గట్టుగా సాగింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను ఫీల్ అయ్యేలా నేపథ్య సంగీతం సాగింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతూన్నారు.వరుణ్ సందేశ్, ఆనీ, తనికెళ్ల భరణి, భద్రం, సూర్య కుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్దార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై, శ్రేయా రాణి రెడ్డి, క్యూ మధు, శ్రీరామ్ సిద్దార్థ్ కృష్ణ, రాజ్ కుమార్ కుర్రా, దుర్గా అభిషేక్ తదితరలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Show comments