Site icon NTV Telugu

Varun Sandesh: జీ5లో స్ట్రీమింగ్‌ కానున్న వ‌రుణ్ సందేశ్ ‘న‌య‌నం’.. ఫ‌స్ట్ లుక్‌ చూశారా

Varun Sandesh

Varun Sandesh

Varun Sandesh: టాలీవుడ్ హీరో వ‌రుణ్ సందేశ్ ఓటీటీ ఎంట్రీపై అధికారిక ప్రక‌ట‌న వ‌చ్చేసింది. ఈ హీరో నటించిన ‘న‌య‌నం’ వెబ్ సిరీస్‌ జీ5లో డిసెంబ‌ర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సీట్ ఎడ్జ్ సైకో థ్రిల్లర్‌ను స్వాతి ప్రకాశ్ డైరెక్ట్ చేశారు. మ‌నుషుల్లోని నిజ స్వభావానికి, ఏదో కావాల‌ని త‌పించే తత్వానికి మ‌ధ్య ఉండే సున్నిత‌మైన అంశాల‌ను ఇందులో చూపించినట్లు డైరెక్టర్ చెప్పారు. ఈ ఒరిజిన‌ల్‌లో ఆరు ఎపిసోడ్స్ ఉన్నాయి. డాక్టర్ న‌య‌న్ పాత్రలో వ‌రుణ్ సందేశ్ ప‌రిచ‌యం కాబోతున్నాడు. త‌న పాత్రలోని డార్క్ యాంగిల్‌, సైక‌లాజిక‌ల్ సంక్లిష్టత‌ను ఇందులో ఆవిష్కరించారు.

READ ALSO: Shamirpet Police Station : శభాష్‌.. శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్.. తెలంగాణలో మొదటి స్థానం

ఈ సంద‌ర్భంగా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోన్న వ‌రుణ్ సందేశ్ మాట్లాడుతూ.. ‘నటుడిగా నాకు ఇది స‌రికొత్త ప్రయాణం అని అన్నారు. ఇప్పటి వ‌ర‌కు చేయ‌న‌టువంటి విభిన్నమైన పాత్రలో డాక్టర్ న‌య‌న్‌గా క‌నిపించ‌బోతున్నట్లు చెప్పారు. పోస్టర్‌ను గ‌మ‌నిస్తే నా పాత్రలో ఇంటెన్సిటీ అర్థమ‌వుతుందని అన్నారు. ఓటీటీలో యాక్ట్ చేయ‌టం వ‌ల్ల ఇలాంటి పాత్రలో డెప్త్‌ను మ‌రింత‌గా ఎలివేట్ చేసిన‌ట్లయ్యిందని వెల్లడించారు. డిసెంబ‌ర్ 19న జీ 5లో ప్రీమియ‌ర్ కానున్న న‌య‌నం ను ప్రేక్షకులు ఎలా ఆద‌రిస్తారో చూడాల‌ని చాలా ఆస‌క్తిగా వెయిట్ చేస్తున్నానట్లు ఆయన చెప్పారు.

READ ALSO: Spirit: ‘స్పిరిట్’ సినిమాలో కబీర్ సింగ్ హీరో..?

Exit mobile version