Site icon NTV Telugu

Varun- Lavanya : వరుణ్ లావణ్య పెళ్లి వేడుకల షెడ్యూల్ ఇదే..ఎవరెవ్వరు వస్తున్నారంటే ?

Varun Lavanya

Varun Lavanya

మెగా కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది.. నిహారిక పెళ్లి తర్వాత మళ్లీ ఇప్పుడు మెగా ఇంట పెళ్లి భాజాలు మొగుతున్నాయి.. మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్​- నటి లావణ్య త్రిపాఠిల పెళ్లి వేడుకలు ఇటలీలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. నవంబర్ 1న ఈ జంట ఏడు అడుగులు వేయబోతున్నారు. తమ్ముడి పెళ్లి కోసం అందరికంటే ముందుగా రామ్‌ చరణ్‌-ఉపాసన ఇటలీ చేరుకుని పెళ్లి ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు. వీరిద్దరి తర్వాతే వరుణ్ తేజ్​- లావణ్య త్రిపాఠి ఇటలీ చేరుకున్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్‌ తన ఫ్యామిలీతో వెళ్లాడు.

ఇలా రామ్‌ చరణ్‌, బన్నీ ఇద్దరూ వరుణ్‌ పెళ్లి ఏర్పాట్లను చేస్తున్నారు.. ఇక మెగా, అల్లు ఫ్యామిలీలు కూడా ఇటలీకి పయనమవుతున్నారు.. ఇకపోతే ఈ పెళ్లి వేడుకను కుటుంబ సభ్యులు అతి కొద్ది మంది సమక్షంలో గ్రాండ్ గా నిర్వహించనున్నారు.. ఈ వేడుక షెడ్యూల్ ను చూస్తే.. ప్రీవెడ్డింగ్‌ వేడుకల్లో భాగంగా అక్టోబర్‌ 30న కాక్‌టేల్‌ పార్టీతో పెళ్లి వేడుకలు మొదలు పెట్టి 31న హల్దీ, మెహందీ నిర్వహించనున్నారు. నవంబర్‌ 1న పెళ్లి తర్వాత ఇటలీ నుంచి తిరిగి వచ్చాక హైదరాబాద్‌లో నవంబర్‌ 5న రిసెప్షన్‌ కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఇండస్ట్రీలోని ప్రముఖులు అందరూ ఆ సమయంలో హాజరు కానున్నారు. వరుణ్‌ వెడ్డింగ్‌ కార్డుకు సంబంధించిన వీడియోతో పాటు కొత్త జంటకు సంబంధిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు.. మెగా, అల్లు కుటుంబ సభ్యులు వివాహ వేడుకలో సందడి చెయ్యనున్నారు..కానీ వరుణ్ నానమ్మ అంజనా దేవి ఈ వేడుకకు దూరంగా ఉండబోతుందని సమాచారం.. ఆ తర్వాత సాయి ధరమ్ కు వివాహం చెయ్యనున్నారని తెలుస్తుంది..

Exit mobile version