NTV Telugu Site icon

Citadel Honey Bunny: 11 నిమిషాల సీన్‌ సింగిల్‌ టేక్‌లో చేశాం: వరుణ్‌

Varun Dhawan, Samantha

Varun Dhawan, Samantha

Citadel Honey Bunny Trailer: వరుణ్‌ ధావన్, సమంత జంటగా నటించిన యాక్షన్‌ థ్రిల్లింగ్‌ వెబ్‌సిరీస్‌ ‘సిటడెల్‌: హనీ- బన్నీ’. ఈ వెబ్‌సిరీస్‌కు రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహించారు. అమెరికన్‌ సిరీస్‌ ‘సిటాడెల్‌’ ఇండియన్‌ వెర్షన్‌గా సిటాడెల్‌: హనీ బన్నీగా వస్తోంది. తాజాగా ముంబైలో లాంఛ్ ఈవెంట్​ నిర్వహించి.. సిటడెల్‌ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ఈవెంట్​లో ​సిరీస్​ కోసం తాను, సమంత ఎంతలా కష్టపడ్డారో వరుణ్ ధావన్ వివరించారు.

వరుణ్ ధావన్ మాలాడుతూ… ‘సిటడెల్‌లో నేను, సమంత 11 నిమిషాల సన్నివేశాన్ని సింగిల్‌ టేక్‌లో చేశాం. ఎటువంటి కట్స్​ లేకుండా చేశాము. సిరీస్​ క్లైమాక్స్​లో ఈ సీన్ వస్తుంది. ఇది పక్కా ఇంటెన్స్​ యాక్షన్ సీక్వెన్స్​. ప్రేక్షకులు థ్రిల్ ఫిల్ అవుతారు. లాక్‌డౌన్‌ సమయంలో నిర్మాత ఆదిత్య చోప్రాను కలిశాను. ఆయన టైగర్‌ 3 సినిమా పనుల్లో ​ బిజీగా ఉన్నారు. యంగ్‌ హీరోస్​తో మీరు యాక్షన్‌ చిత్రాలను ఎందుకు చేయరు? అని అడిగా. బడ్జెట్‌ లెక్కలు ఉంటాయని ఆయన బదులిచ్చారు. సిటడెల్‌ కోసం నన్ను కలిసినప్పుడు బడ్జెట్‌ గురించే ముందుగా మాట్లాడాను. నాకు అవకాశం ఇచ్చిన రాజ్‌ అండ్​ డీకే, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోకు ప్రత్యేక కృతజ్ఞతలు’ అని తెలిపారు.

Also Read: IND vs NZ: నేడే భారత్‌, న్యూజిలాండ్‌ తొలి టెస్టు.. వాతావరణం, పిచ్ రిపోర్ట్ డీటెయిల్స్!

‘ఫ్యామిలీ మ్యాన్‌2’లో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో అదరగొట్టిన సమంత.. సిటాడెల్‌ కోసం ప్రత్యేకంగా సిద్ధమైంది. మార్షల్‌ ఆర్ట్స్‌లోనూ శిక్షణ తీసుకుంది. ఎలాంటి డూప్‌ లేకుండా సామ్ స్వయంగా యాక్షన్‌ సీక్వెన్స్‌ను పూర్తి చేశారట. ఈ వెబ్‌సిరీస్‌లో వరుణ్‌, సమంత కలిసి చేసే యాక్షన్‌ సన్నివేశాలు అలరిస్తాయని టాక్‌. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో నవంబరు 7 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సిరీస్‌లో కేకే మేనన్‌, సిమ్రన్‌, సోహమ్‌ మజుందార్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Show comments