Site icon NTV Telugu

Varun Aaron: ఐపీఎల్ 2026 కోసం కొత్త బౌలింగ్ కోచ్‌ను ప్రకటించిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌..!

Varun Aaron

Varun Aaron

Varun Aaron: ఐపీఎల్ 2025లో పేలవమైన ప్రదర్శనతో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఇప్పుడు పునర్నిర్మాణ మార్గంలో అడుగులు వేస్తోంది. నష్టాలన్నో ఎదుర్కొన్న అనంతరం, ఫ్రాంఛైజీకి కీలక మార్పులు అవసరమేనని స్పష్టమయ్యింది. ఇందులో భాగంగా ఇప్పడు మార్పులు కార్యరూపం దాల్చుతున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ బౌలింగ్ కోచ్ గా ప్రఖ్యాత పేసర్ డేల్ స్టెయిన్ తప్పుకున్న తర్వాత, జేమ్స్ ఫ్రాంక్లిన్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమించిన SRH.. అతని హయంలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో మరో మార్పుకు పూనుకుంది. తాజాగా SRH కొత్త బౌలింగ్ కోచ్‌గా మాజీ భారత పేసర్ వరుణ్ ఆరోన్ ను నియమించింది.

Read Also:Lords Test: ఫలించని జడేజా పోరాటం.. లార్డ్స్‌లో ఇంగ్లాండ్ విజయ కేతనం..!

ఇటీవలి కాలంలో కామెంటరీ బాక్స్‌లో తన అద్భుతమైన క్రికెట్ జ్ఞానం, వ్యూహాత్మక ఆలోచనలతో వరుణ్ ఆరోన్ అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు SRH కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో కలిసి జట్టుకు బలమైన బౌలింగ్ యూనిట్‌ను తీర్చిదిద్దేందుకు వరుణ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక్కడ ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే.. వరుణ్ ఆరోన్ ఇంగ్లాండ్‌లో ఇండియా, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌కు కామెంటరీ చెబుతూ ఉన్నారు. ఆయన కామెంటరీ చేస్తుండగానే లార్డ్స్ టెస్ట్ మధ్యలో ఈ ప్రకటన విడుదలైంది.

Read Also:Flipkart GOAT sale Scam: ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్‌ను టార్గెట్ చేసుకున్న స్కామర్లు.. నకిలీ కస్టమర్ సపోర్ట్, క్లోన్ వెబ్‌సైట్లతో వల..!

వరుణ్ ఆరోన్‌కి ఐపీఎల్‌లో విశేష అనుభవం ఉంది. ఆర్సీబి, ఢిల్లీ డేర్‌డెవిల్స్, కింగ్స్ XI పంజాబ్, కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ లాంటి ఆరు జట్ల తరపున ఆడాడు. ఐపీఎల్‌లో మొత్తం 52 మ్యాచ్‌లలో 44 వికెట్లు తీసిన అతను చివరిసారి 2022 సీజన్‌లో కనిపించాడు. ఇక ఇంటర్నేషనల్ స్థాయిలో అతను 9 టెస్టులు, 9 వన్డేలు ఆడిన అనుభవం ఉంది. మొత్తంగా.. ఈసారి కొత్త బౌలింగ్ కోచ్‌గా వరుణ్ ఆరోన్ బాధ్యతలు చేపట్టడం వల్ల, SRH తమ బౌలింగ్ విభాగాన్ని పునరుద్ధరించి పోటీకి సిద్ధంగా చేయాలనే లక్ష్యంతో ఉంది. వరుణ్ దేశీయ, అంతర్జాతీయ అనుభవం జట్టుకు విజయాన్ని అందిస్తుందని భావిద్దాం.

Exit mobile version