Site icon NTV Telugu

Gyanvapi mosque case: శివలింగం కార్బన్‌ డేటింగ్‌పై అక్టోబర్‌ 14న న్యాయస్థానం తీర్పు

Gyanvapi Case

Gyanvapi Case

Gyanvapi mosque case: ఈ ఏడాదిలో ప్రారంభం అయిన జ్ఞానవాపి మసీదు కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ముందుగా వారణాసి సివిల్ కోర్టు మసీదులో వీడియో సర్వేకు అనుమతి ఇవ్వడంతో అక్కడి వాజూఖానాలో శివలింగం వంటి ఆకారం బయటపడింది. ఒక్కసారిగా ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరో వైపు అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం.. ఆ తరువాత ఈ కేసును వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసు వారణాసి జిల్లా కోర్టు పరిధిలో ఉంది. విచారణలో హిందూ పక్షం లాయర్ శివలింగంపై శాస్త్రీయ పరిశోధన జరగాలని..అందుకు ‘కార్బన్ డేటింగ్’ చేయాలని కోర్టును కోరిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై వారణాసి కోర్టు అక్టోబర్‌ 14న తీర్పును వెలువరించనుందని హిందూ, ముస్లిం పక్షాల న్యాయవాదులు మంగళవారం చెప్పారు. ఈ విచారణ నిమిత్తం అక్టోబర్‌ 11న ముస్లిం పక్షం తమ వాదనలను కోర్టుకు వినిపించింది.

ప్రారంభంలో జ్ఞానవాపీ మసీదు వెలుపల ఉన్న హిందూ దేవీదేవతలకు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ.. ఐదుగురు మహిళలు కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసులో గత నెలలో శాస్త్రీయ దర్యాప్తు కోసం పిటిషన్ దాఖలు అయింది. శివలింగం వయసును నిర్థారించేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాచే కార్బన్ డేటింగ్ నిర్వహించాలని మహిళలు తమ పిటిషన్ లో కోరారు. ఇదిలా ఉంటే ఐదుగురు మహిళల్లో నలుగురు శాస్త్రీయ అధ్యయనం కోసం కార్బన్ డేటింగ్ కోరాగా.. దీని వల్ల శివలింగానికి హాని కలుగవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Fake Astronaut Scams: వ్యోమగామినంటూ వల.. భూమికి తిరిగిరాగానే పెళ్లంటూ లక్షలు గుంజాడు..

ఇదిలా ఉంటే ముస్లింపక్షం శాస్త్రీయ విచారణపై అబ్యంతరాన్ని వ్యక్తం చేసింది. హిందూ మహిళలు చెబుతున్నట్లు జ్ఞానవాపి మసీదుకు ఎలాంటి సంబంధం లేదని.. శివలింగం అని పిలువబడుతున్న ఆకారం ఓ ఫౌంటెన్ అని మసీదు కమిటీ చెబుతోంది. కోర్టు అంతకుముందు విచారణలో కీలక తీర్పు వెల్లడించింది. ప్రార్థనా స్థలాల చట్టం-1991 ఈ కేసులో వర్తించదని తీర్పు చెప్పింది. ఇది ఆగస్టు15, 1947 కన్నా ముందు నుంచే మనుగడలో ఉండటంతో ఈ చట్టం వర్తించదని వెల్లడించింది.

Exit mobile version