S. Saraswathi: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘ఎస్. సరస్వతి’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్, తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎస్. సరస్వతి’. మార్చి 6, 2026న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అనుకున్నంత హిట్ అందుకోలేకపోయింది. అయితే సరిగ్గా నెల రోజుల వ్యవధిలోనే ఓటీటీ ప్రేక్షకులను పలకరించింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో ఏప్రిల్ 3, 2026 (శుక్రవారం) నుండి ఈ సినిమా సైలెంట్‌గా స్ట్రీమింగ్ అవుతోంది.
Also Read : Abhishek Bachchan: ఐశ్వర్యతో విడాకుల పుకార్లకు అభిషేక్ బచ్చన్ చెక్..
Also Read
ఇక ఈ మూవీ కథ గురించి మాట్లాడుకుంటే.. లక్ష్మి (వరలక్ష్మి) ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేస్తుంటుంది. ఒకరోజు తన కూతురు సరస్వతిని స్కూల్‌లో దించి వెళ్తుంది. సాయంత్రం పాపను పికప్ చేసుకోవడానికి వెళ్తే.. అసలు ఆ పేరుతో పాపనే లేదని స్కూల్ యాజమాన్యం చెబుతుంది. తన కూతురిని స్కూల్‌లోనే ముగ్గురు రేప్ చేసి చంపేశారని లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. కానీ ఆధారాలు లేవని కోర్టు కేసును కొట్టివేస్తుంది. ఈ క్రమంలో లక్ష్మి ఒక జడ్జీని, ఐఏఎస్ ఆఫీసర్‌ను, పోలీస్‌ను హత్య చేస్తుంది. అసలు లక్ష్మికి నిజంగానే కూతురు ఉందా? ఆమె గతం ఏంటి? అనే ఉత్కంఠభరితమైన అంశాలతో ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సాగుతుంది.
ఇక ఈ సినిమా టైటిల్ విషయంలో మొదట అభ్యంతరాలు రావడంతో ‘సరస్వతి’ నుండి ‘ఎస్. సరస్వతి’గా మార్చారు. అంతేకాకుండా, ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ కథ తనదని, తన కథను వరలక్ష్మీ మార్చేసిందని సంచలన ఆరోపణలు చేయడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. థియేటర్లలో ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, జీవా, ప్రియమణి, ప్రకాష్ రాజ్ వంటి భారీ తారాగణం ఉండటంతో ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?