NTV Telugu Site icon

Varalakshmi Sarathkumar: అయ్యో పాపం.. వాటిని పోగొట్టుకున్న హీరోయిన్.. వీడియోలో..

Varalakshmi Sarah Kumar

Varalakshmi Sarah Kumar

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా టమోటాల చర్చ నడుస్తుంది.. టమోటాల రేటు పెరగడంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ టమాటాల గురించే మాట్లాడుకుంటున్నారు. టమాటాల వల్ల నష్టపోయి రోడ్డుమీద పారేసిన రోజుల నుంచి రైతులు.. ప్రస్తుతం ఆ టమాటాలు అమ్ముకుని కోటీశ్వరులు అవుతున్నారు. ఈక్రమంలోనే టమాటాలపై.. వాటి రేటుపై ఎన్నో వీడియోలు..మీమ్స్.. జోకులు.. ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. కామన్ నెటిజన్లు.. యూబ్యూబర్లతో పాటు. ఫిల్మ్ సెలబ్రిటీలు కూడా టమాటాల రేట్లపై వారికి తోచిన వీడియోలు వారు చేస్తూ.. ఎంటర్టైన్ చేస్తున్నారు.. కొన్ని వీడియోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి..

తాజాగా తమిళ స్టార్ నటి టాలీవుడ్ లేడీ విలన్ వరలక్ష్మీ శరత్ కుమార్ ఓ వీడియోను పోస్ట్ చేశారు. తన టమాటాల బ్యాగ్ ఓదొంగ ఎత్తికెళ్ళిపోయాడంటూ.. వీడియోను శేర్ చేశారు నటి. అక్కడే తన ప్రతిభ చూపించారు వరలక్ష్మీ.. ఆ వీడియో లో వరలక్ష్మీ శరత్ కుమార్ ఓ రాతి గోడ దగ్గర నిలబడి ఉంటుంది. ఆమె మరొక అమ్మాయితో డీప్ గా మాట్లాడుతూ ఉంటుంది. అప్పటికే తన దగ్గర ఉన్న ఫోన్ తో పాటు తను కొన్న టమాటాలను కూడా ఆ గోడపై పెట్టి మాట్లాడుతుంటుంది.. వెనుక నుంచి వచ్చిన ఒక దొంగ సెల్ ఫోన్ ను దొంగతనం చేసి తీసుకెళ్తాడు.. అప్పుడు అమ్మడు లైట్ తీసుకుంటుంది..

అదే దొంగ మళ్లీ వెనక్కి వచ్చి ఫోన్ అక్కడ పెట్టేసి టమాటాల ప్యాక్ ను ఎత్తుకెళ్లిపోతాడు. దాంతో అది చూసిన వరలక్ష్మీ.. ఆమె మాట్లాడుతున్న వ్యక్తి ఇద్దరు కలిసి ఆ దొంగ వెంట పడతారు. అలా టమాటాల విలువ తెలియజేస్తున్నట్టుగా వరలక్ష్మీ శరత్ కుమార్ చేసిన ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరలక్ష్మీ టాలెంట్ కు ఫిదా అవుతున్నారు నెటిజన్లు.. రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం టమాట ప్రియలను కన్నీరు పెట్టిస్తుంది వాటి ధర. ఎంతో ఇష్టంగా టామాటాలు తినేవారు.. వాటినికొనలేక ఊరకే ఉండాల్సి వస్తోంది. మొన్నటి వరకూ కిలో 100 నుంచి 150 వరకూ ఉన్న టమాటా.. రీసెంట్ గా 200 కిలో రేటు పలుకుతున్నట్టు తెలుస్తోంది. మరికొన్ని రోజులు ఈ ధరలు ఇలానే ఉంటాయి అంటున్నారు నిపుణులు. ఒకప్పుడు టమాటాల కు రేటు లేక రైతులునష్టపోయారు.. ఇప్పుడు మాత్రం తగ్గేదేలే అంటున్నారు.. ఇక ధరలు ఎప్పుడు తగ్గుతాయో చూడాలి..

Show comments