Site icon NTV Telugu

Vanitha TV : ఇక నుంచి టాటా ప్లేలో ‘వనిత’.. మహిళలకు మరింత చేరువలో..

Vanitha Tv

Vanitha Tv

వనిత’ టీవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహిళల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటైన తొలి తెలుగు చానెల్‌ వనిత టీవీ. పొలిటికల్‌ న్యూస్‌, ఎంటైర్మెనెంట్‌, ఈవెంట్స్, వంటలు, హెల్త్‌ ప్రోగ్రామ్స్‌, కొటిదీపోత్సవం ఇలా ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలతో అలరిస్తోంది వనిత టీవీ.. అన్ని టివీల్లోకి వనిత టీవీ విభిన్నమైనది. అక్టోబరు 9 2008న ఈ టీవి ప్రారంభమైనది. మొదటి ఏడాదిలోనే ఎన్నో విజయాలను సాధించింది. అయితే.. మారుతున్న అధునాతన టెక్నాలజీ పరంగా వనిత టీవీ కూడా మహిళలకు మరింత చేరువయ్యేందుకు మరో ముందడుగు వేసింది. ఈ నేపథ్యంలోనే.. ఇక నుంచి టాటా ప్లేలో కూడా వనిత టీవీ అందుబాటులోకి వచ్చింది. టాటా ప్లేలో ఛానెల్‌ నెంబర్‌: 1425లో ప్రసారమవుతోంది. మహిళలకు మెచ్చే ఈ చానెల్‌లో నారీమణులకు అవసరమయ్యే ఎన్నో ప్రొగ్రాంలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎంటైర్మెనెంట్‌, ఈవెంట్స్, వంటలు, హెల్త్‌ ప్రోగ్రామ్స్‌ తో పాటు మహిళలకు ఎంతో ఇష్టమైన స్టార్‌ వనిత ప్రొగ్రాంలతో అందరినీ అలరిస్తోంది. ఎంతో ఆనందాన్ని.. అవగాహనను కల్పించే వనిత టీవీ ఇక.. వీక్షించండి టాటా ప్లేలో కూడా..

 

Exit mobile version