వనిత విజయ్ కుమార్.. ఈమె తెలుగులో దేవీ సినిమాలో ఎంతో అమాయకంగా నటించిన విషయం అందరికి తెలిసిందే. కానీ నిజ జీవితంలో ఆమె ఒక ఫైర్ బ్రాండ్.పెళ్లిళ్ల విషయంలో అలాగే తండ్రితో గొడవల విషయంలో ఆమె పేరు బాగా పాపులర్ అయింది.ప్రముఖ నటి మంజుల మరియు నటుడు విజయ్ కుమార్ ల కుమార్తె అని అందరికి తెలుసు.వనిత విజయ్ కుమార్ ఎంతో చిన్న వయసులో పెళ్లి చేసుకుంది.మొదటి పెళ్లి తర్వాత మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకుంది. అలాగ రెండో పెళ్లి, మూడో పెళ్లి ఆ తరువాత నాలుగో పెళ్లి అంటూ ఆమె తన జీవితం నాశనం చేసుకుంది.వనితా విజయ్ కుమార్ తన సోదరి అయినా శ్రీదేవి పెళ్లి తన వల్లే జరిగిందని కానీ నేడు ఆ విషయం మర్చిపోయి అందరు తన కుటుంబ సభ్యులు తనను బ్లాక్ చేసారని అలాగే తన ఫోన్ నంబర్స్ తో పాటు సోషల్ మీడియాలో కూడా శ్రీదేవి తనను బ్లాక్ చేసేంత తప్పు తానేమి చేయలేదని చెప్పుకొస్తుంది..
వనిత విజయ్ కుమార్ రెండవ భర్త అయినా ఆనంద్ జయరంజన్ ప్రాణస్నేహితుడి చుట్టాల అబ్బాయి అయిన రాహుల్ మంచి వ్యక్తి అని తెలిసి తన సోదరి అయినా శ్రీదేవి తో సంబంధం తానే కుదిర్చానని మొదట్లో సినిమా వారిని చేసుకోవడానికి రాహుల్ కుటుంబ సభ్యులు అంతగా ఒప్పుకోక పోతే శ్రీదేవి అందరి లాంటి అమ్మాయి కాదని, ఆమె ఎంతో మంచి అమ్మాయి అని చెప్పి తానే అందరిని ఒప్పించి మరీ పెళ్లి చేసానని వనిత ఇటీవల ఒక మీడియా ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.. తనకు మంచి భర్తను మరియు మంచి కుటుంబం ఇచ్చినందుకు శ్రీదేవి కూడా మొదట్లో తనకు ఎంతగానో థాంక్స్ చెప్పేది నాడు తన సోషల్ మీడియా అకౌంట్స్ లో కూడా తనకు ఈ పెళ్లి చేసింది వనిత అని అందుకే ఆమెకు థాంక్స్ అంటూ పోస్ట్ కూడా శ్రీదేవి పెట్టిందని, కానీ నేడు ఆస్తుల పంపకాలు జరిగి అందరు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారని తనకు రావాల్సిన వాటాను ఇవ్వకుండా తన తండ్రి తనను ఇంట్లో నుంచి బయటకు నెట్టేసాడని శ్రీదేవి నన్ను అన్ని అకౌంట్స్ లో బ్లాక్ చేసింది అని ఆమె చెప్పుకొచ్చింది.