Site icon NTV Telugu

Vangaveeti Radha Krishna: వంగవీటి మోహన రంగా జయంతి వేడుకలు.. వంగవీటి రాధా కీలక వ్యాఖ్యలు

Vangaveeti Radha Krishna

Vangaveeti Radha Krishna

Vangaveeti Radha Krishna: వంగవీటి మోహన రంగా జయంతి వేడుకల్లో కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన కుమారుడు వంగవీటి రాధా.. వంగవీటి రంగా 77వ జయంతిని పురస్కరించుకుని.. విజయవాడ బందర్ రోడ్డులో రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు వంగవీటి రాధాకృష్ణ.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంగా జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్నాం అన్నారు.. రంగా ఆశయ సాధనకు అందరం కలిసి పని చేస్తామని ప్రకటించారు రాధా..

Read Also: Amrapali Kata: రహదారులపై తనిఖీలు.. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆన్‌ డ్యూటీ..

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై వంగవీటి రాధా కీలక వ్యాఖ్యలు చేశారు.. ప్రజలకు ప్రభుత్వాలు ప్రాముఖ్యత ఇవ్వాలని సూచించిన ఆయన.. ప్రజలను పట్టించుకోకపోతే నాయకులకు.. ప్రజలు ఎలా బుద్ధిచెబుతారో మొన్నటి ఎన్నికల్లోనే చూశాం అన్నారు.. ఈ ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో నాయకులకు ఎలా బుద్ధి చెప్పారో మనకు కనిపిస్తుందన్న ఆయన.. అందరం కష్టపడి పని చేసేది, చేసింది ప్రజల క్షేమం కోసమేనని స్పష్టం చేశారు.. ఈ ఎన్నికలు ప్రజల కోసం జరిగిన ఎన్నికలుగా అభివర్ణించారు.. ఎన్నికల్లో ప్రజలు గెలిచారని పేర్కొన్నారు.. కానీ, ఇవి బేర సారాల కోసం, పదవుల కోసం జరిగిన ఎన్నికలు కావు అని వ్యాఖ్యానించారు. ప్రతి సామాన్యుడుకు న్యాయం జరగాలన్నదే.. వంగవీటి మోహన రంగా ఆశయం అని స్పష్టం చేశారు వంగవీటి రాధాకృష్ణ..

Exit mobile version