Site icon NTV Telugu

Vangaveeti Ranga Death Anniversary: వంగవీటి రంగా వర్ధంతి వేడుకలకు దూరంగా రాధా!

Vangaveeti Ranga Death Anniversary

Vangaveeti Ranga Death Anniversary

Vangaveeti Ranga 35th Death Anniversary: నేడు మాజీ ఎమ్మెల్యే, స్వర్గీయ వంగవీటి మోహన రంగా 35వ వర్ధంతి. బెజవాడలో వంగవీటి రంగా వర్ధంతి వేడుకలను ఆయన కుటుంబసభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే రంగా వర్ధంతి వేడుకలకు ఆయన కుమారుడు వంగవీటి రాధా కృష్ణ దూరంగా ఉన్నారు. బెజవాడ బందరు రోడ్డులో విగ్రహం దగ్గర వర్ధంతి కార్యక్రమంలో రాధా పాల్గొనకపోవడం ఇదే తొలిసారి. తండ్రి రంగాకి తర్పణం నిర్వహించటానికి కాశీ వెళ్లిన కారణంగా ఆయన బెజవాడ వర్ధంతి కార్యక్రమంకు దూరమయ్యారు.

వర్ధంతి కార్యక్రమంలో వంగవీటి రంగా కుమార్తె ఆశా, వంగవీటి రాధా భార్య పుష్ప వల్లి పాల్గొన్నారు. ఇద్దరు బందరు రోడ్డులో ఉన్న రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిచారు. కాశీలో వంగవీటి రంగా తర్పణంలో పాల్గొనటం కారణంగా రాధా రాలేదని ఆయన అనుచరులు చెప్పారు. జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ.. రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

Also Read: CM YS Jagan: గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. కలకలం సృష్టించిన ఫ్లెక్సీ!

వంగవీటి ఆశా మాట్లాడుతూ… ‘వంగవీటి రాధా కాశీలో మా నాన్న వంగవీటి రంగా వర్దంతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రంగా అభిమానులంతా మా‌ కుటుంబ సభ్యులే‌. వర్దంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు రంగా వర్దంతి కాబట్టి రాజకీయాలు మాట్లాడడం సరికాదు’ అని అన్నారు.

Exit mobile version