Site icon NTV Telugu

Vandhebharat Express: నేడు సికింద్రాబాద్‌ నుంచి వైజాగ్‌ వెళ్లే వందేభారత్‌ రైలు రద్దు

Vandebharat Train

Vandebharat Train

Vandhebharat Express: నేడు సికింద్రాబాద్ నుంచి వైజాగ్‌ వెళ్లాల్సిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును(నం.20834) అధికారులు రద్దు చేశారు. సాంకేతిక లోపం వల్ల ఆ రైలు రద్దు చేయబడింది. ఇందులోని ప్రయాణీకులందరికీ పూర్తి ఛార్జీ వాపసు చేయబడుతుందని అధికారులు ప్రకటించారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. అయితే దానికి ప్రత్యామ్నాయంగా మరో ప్రత్యేక రైలును(నం. 08134) ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వందేభారత్‌ షెడ్యూల్‌ ప్రకారమే ఆ రైలు బయలుదేరుతుందని పేర్కొన్నారు. ఆ రైలు మాదిరిగా అన్ని స్టాపేజ్‌లతోనే నడపబడుతుందని చెప్పారు. సికింద్రాబాద్‌ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి.. రాత్రి 11.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుందన్నారు. ఆసక్తిగల ప్రయాణికులు దయచేసి ఈ రైలులో తమ టిక్కెట్లను బుక్ చేసుకోవలసిందిగా దక్షిణ మధ్య రైల్వే కోరింది.

Read Also: Hyderabad Crime: మీ ఇంటిని దెయ్యం ఆవహించిందంటూ.. మహిళకు టోకరా

Exit mobile version