NTV Telugu Site icon

Vande Bharat Train: వందే భారత్ రైలుపై మరోసారి రాళ్ల దాడి..

Train Stone

Train Stone

Stones On Vande Bharat Train: లక్నో నుంచి పాట్నా వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (22346)పై గుర్తు తెలియని వ్యక్తి రాళ్లతో దాడి చేశాడు. ఈ ఘటన బుధవారం రాత్రి వారణాసి పరిసరాల్లో చోటుచేసుకుంది. బుధవారం రాత్రి 8.15 గంటల ప్రాంతంలో నిందితులు రాళ్లు రువ్వి రైలు సీ5 కిటికీ అద్దాన్ని ధ్వంసం చేశారని రైల్వే అధికారులు తెలిపారు. భారతీయ రైల్వే నుండి అందిన సమాచారం ప్రకారం.. వందేభారత్ రైలు నంబర్ 22346పై రాళ్లు రువ్వబడ్డాయి. రైలు లక్నో నుంచి పాట్నా వెళ్తోన్న సమయంలో బనారస్-కాశీ మధ్య రోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. రాత్రి 8:15 గంటల ప్రాంతంలో రాళ్ల దాడి ఘటన చోటుచేసుకుంది. విషయం వెలుగులోకి రావడంతో ఆర్పీఎఫ్ సిబ్బంది చర్యలు చేపట్టింది.

IT Minister Sridhar Babu: హైదరాబాద్ లో 200 ఎకరాల్లో AI సిటీ నిర్మాణం.. ఇది మా డ్రీమ్ ప్రాజెక్టు..

ఘటనా స్థలాన్ని బనారస్, కాశీకి చెందిన ఆర్‌పిఎఫ్ సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కాని., ఇప్పటివరకు నిందితుల క్లూ కనుగొనబడలేదు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, రైల్వే చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద అవుట్ పోస్ట్ కాశీలో కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్ ఇన్‌చార్జ్ ఆర్‌పిఎఫ్ వ్యాస్‌నగర్ దీని దర్యాప్తు చేస్తున్నారు. వందే భారత్‌లో అమర్చిన కెమెరాలను తనిఖీ చేయడానికి స్థానిక ఇన్‌పుట్‌ లను సేకరిస్తున్నారు. దాంతో ఆర్‌పిఎఫ్ సిబ్బంది నిందితులను పట్టుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.

Show comments