బీహార్ రాష్ట్రంలోని గయ జిల్లాలో రైలు ప్రమాదం తృటిలో తప్పిపోయింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఈస్ట్ సెంట్రల్ రైల్వే గ్రాండ్ కార్డ్ రైల్వే సెక్షన్‌లో ఈ రైలు ప్రమాదం జరిగింది. గయ జిల్లాలో గల ఈస్ట్ సెంట్రల్ రైల్వే గ్రాండ్ కార్డ్ రైల్వే సెక్షన్ పరిధిలోని మాన్‌పూర్ జంక్షన్‌లో హోమ్ సిగ్నల్ దగ్గర ఓవర్ హెడ్ వైరు తెగిపోవడంతో.. ముందస్తు చర్యల్లో భాగంగా రాంచీ-పట్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్, రాంచీ-పట్నా జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లను అంతకు ముందుగల రైల్వే స్టేషన్‌లలో ఆపి వేశారు. ఇక, తెగిన వైర్‌ను సరి చేసేందుకు సుమారు రెండు గంటల సమయం పట్టింది. దీంతో వందే భారత్, జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లలోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Read Also: Cabinet Portfolios: కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు.. ఎవరికి ఏ శాఖ దక్కుతుందో..?
అయితే, మాన్‌పూర్ జంక్షన్ హోమ్ సిగ్నల్ సమీపంలో ఓవర్ హెడ్ వైర్ తెగిపోయి ఉండటంతో రైల్వే సిబ్బంది వెంటనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ట్రాక్షన్ డిపార్ట్‌మెంట్, ఇతర విభాగాలకు చెందిన టీమ్స్ సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రాత్రి తొమ్మిది గంటలకు మరమ్మతు పనులు కంప్లీట్ కావడంతో ఈ మార్గంలోని ప్రయాణాలు సాఫీగా సాగాయి. ప్రమాద సమయంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను గుర్పా రైల్వే స్టేషన్‌లో, జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను టంకుప్ప రైల్వే స్టేషన్‌లో ఆపేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.