Site icon NTV Telugu

Value Zone Hyper Mart: నగరంలో వాల్యూ జోన్‌ హైపర్‌ మార్ట్‌.. రేపే ప్రారంభం

Value Zone

Value Zone

Value Zone Hyper Mart: మహానగరం హైదరాబాద్‌లో ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలు తమ ఔట్‌లెట్లను ప్రారంభించాయి. తాజాగా ప్రముఖ రిటైల్‌ సంస్థ వాల్యూ జోన్‌ హైదరాబాద్‌లో హైపర్‌మార్ట్‌ను ప్రారంభించబోతోంది. పటాన్‌చెరు వద్ద ఏర్పాటు చేసిన ఈ హైపర్‌ మార్ట్‌ను ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ తమ చేతుల మీదుగా రేపు(డిసెంబర్‌ 15) ప్రారంభించనున్నారు. నగరవాసులకు సరికొత్త షాపింగ్‌ అనుభవం కల్పించాలని ఉద్దేశంతో ఈ హైపర్‌మార్ట్‌ను ఏర్పాటు చేసినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

Read Also: Bigg Boss Telugu 7: పల్లవి ప్రశాంత్ గెలవాలని అభిమాని ఏం చేశాడో తెలుసా?

షాపింగ్‌ అంటే కేవలం వస్తువులను కొనుగోలు చేయడం మాత్రమే కాదని. ఒక అనుభవంగా ఊహించుకునేందుకుగాను సరికొత్తగా డిజైన్‌ చేసినట్లు వెల్లడించింది. మాల్‌లో నిత్యవసర వస్తువులు, ఫుడ్, బట్టలు అందుబాటులో ఉంటాయని.. ఫ్యాషన్‌, ఫుడ్‌, ఫన్‌ ఉంటాయని కంపెనీ తమ ప్రకటనలో వెల్లడించింది. పురుషులు, మహిళలు, చిన్నపిల్లల కోసం వస్త్రాలు, ఫుట్‌వేర్‌తో పాటు ఇంట్లోకి కావాల్సిన అన్ని వస్తువులు లభిస్తాయని తెలిపింది. ఫుడ్‌కోర్టు కూడా ఉందని కంపెనీ తెలిపింది. కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి 40 శాతం రాయితీ ఇస్తున్నట్టు తెలిపింది. అదిరిపోయే ఆఫర్లను కొనుగోలుదారుల కోసం ఏర్పాటు చేసిన కంపెనీ తెలిపింది.

Exit mobile version