పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కంకిపాడు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. విషయం తెలుసుకున్న వంశీ సతీమణి పంకజశ్రీ కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని సైతం ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రిలో వంశీకి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో కంకిపాడు పోలీస్ కస్టడీ లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. వంశీ ఆరోగ్యం పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. మెరుగైన వైద్యం కోసం ఎయిమ్స్ కి తరలించాలని పేర్ని నాని ఆసహనం వ్యక్తం చేశారు.
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత.. కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స
- వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత
- కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స

Vallabhaneni Vamsi