Valentines Night OTT: ఏడాది తర్వాత ఓటీటీలోకి ‘వాలంటైన్స్‌ నైట్‌’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Valentines Night Ott

Valentines Night Ott

Valentines Night OTT Released Date Out: ’30 వెడ్స్‌ 21′ వెబ్‌ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న చైతన్య రావ్‌.. హీరోగా నటించిన చిత్రం ‘వాలెంటైన్స్ నైట్’. దర్శకుడు అనిల్ గోపిరెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో సునీల్, లావ‌ణ్య, శ్రీకాంత్ అయ్యంగార్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించారు. గతేడాది జనవరి 26న థియేటర్లలో రిలీజ్ అయిన వాలెంటైన్స్ నైట్ సినిమాకి మంచి టాక్ వచ్చినా.. థియేటర్లలో పెద్దగా ఆడలేదు. లవ్, డ్రగ్స్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది.

వాలెంటైన్స్ నైట్ చిత్రం ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ ‘ఆహా’ ఈ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. వేలంటైన్స్‌ డే 2024 తర్వాతి రోజు ఫిబ్రవరి 15న ఈ సినిమాని ఓటీటీ స్ట్రీమింగ్‌కు రాబోతుంది. ఈ విషయాన్ని ‘ఈటీవీ విన్‌’ తమ సోషల్‌ మీడియా ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించింది. థియేటర్లలో చూడని వారు ఎంచక్కా ఇంట్లోనే కూర్చుని వాలెంటైన్స్ నైట్ చిత్రంను ఎంజాయ్ చేయొచ్చు.

Also Read: Hero Nandu: స్వయంగా వండి.. 800 మంది ఆకలి తీర్చిన హీరో నందు!

వాలెంటైన్స్ నైట్ సినిమా 2023 జనవరి 26న థియేటర్లలో రిలీజ్ అయింది. బడ్జెట్ పరంగా చిన్న మూవీగా కావడంతో.. పెద్దగా ప్రమోషన్లు కూడా చేయలేదు. దాంతో చాలా మందికి ఈ సినిమా రిలీజ్ అయిన విషయం కూడా తెలియదు. పాజిటివ్‌ టాక్‌ వచ్చినా ప్రమోషన్లు సరిగా నిర్వహించకపోవడం ఈ సినిమాకు మైనస్‌గా మారింది. అయితే ఓటీటీలో మంచి వ్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాలెంటైన్స్ నైట్ చిత్రంతో లవ్ స్టోరీతో పాటు సందేశాన్ని కూడా మేకర్స్ ఇచ్చారు. యువత జీవితాలపై డ్రగ్స్ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయన్న అంశంను ఇందులో చూపించారు.