Site icon NTV Telugu

Valatty : ఓటీటీ లోకి వచ్చేసిన డాగ్స్ లవ్ మూవీ..

Whatsapp Image 2023 11 07 At 10.49.36 Pm

Whatsapp Image 2023 11 07 At 10.49.36 Pm

ప్రస్తుతం ఓటీటీలో మలయాళ సినిమాలకు క్రేజ్ మాములుగా లేదు..పూర్తిగా భిన్నమైన కాన్సెప్టులు, ఎంతో నాచురల్ గా తెరకెక్కే ఈ మలయాళ సినిమాలకు తెలుగులో సపరేట్‌ ఫ్యాన్ బేస్ ఉంది..తెలుగు ప్రేక్షకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకునే పలు ఓటీటీ సంస్థలు మలయాళ సినిమాలను తెలుగులోకి డబ్బింగ్‌ చేసి మరీ తమ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్‌ చేస్తున్నాయి.. తెలుగు లో విడుదల అయిన 2018, పద్మినీ, జర్నీ ఆఫ్‌ 18 ప్లస్ మరియు కాసర్‌ గోల్డ్‌ అలా విడుదల అయినవే…. ఇలా ఎన్నో మలయాళ సినిమాలు తెలుగు ఓటీటీలో రిలీజై తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఇప్పుడు మరో మలయాళ బ్లాక్‌ బస్టర్‌ ఓటీటీలోకి వచ్చేసింది. అదే వాలట్టి. డాగ్స్‌ లవ్‌ కాన్సెప్ట్‌కు కాస్త ఫన్‌ను జోడించి ఈ మూవీని రూపొందించారు. ఎలాంటి వీఎఫ్‌క్స్‌ ను ఉపయోగించకుండా నిజమైన డాగ్స్ ను యాక్టర్లుగా తెరకెక్కించిన తొలి భారతీయ చిత్రం వాలట్టీ కావడం విశేషం.

జులై 21న థియేటర్లలో విడుదలైన ఈ మలయాళ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్ స్టార్‌ వాలట్టి డిజిటల్‌ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళ మరియు కన్నడ భాషల్లో వాలట్టీ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.వాలట్టీ సినిమా కు దేవన్ జయకుమార్ దర్శకత్వం వహించారు. ఫ్రైడే ఫిల్మ్ హౌస్ పతాకంపై విజయ్ బాబు ఈసినిమా ను నిర్మించారు. వరుణ్ సునీల్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. విష్ణు పనికర్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఈ మూవీలో డాగ్స్ నటించినా షన్ మాథ్యూ, రవీనా రవి, సౌబిన్ షాహిర్, సన్నీ వైన్, సైజు కురుప్, అజు వర్గీస్, ఇంద్రన్స్ మరియు రజినీ హరిదాస్ లాంటి స్టార్లు వాయిస్ ఓవర్ ఇవ్వడంతోఈ మూవీ రేంజ్ మరో లెవెల్ కు వెళ్లిపోయింది.

Exit mobile version