Site icon NTV Telugu

Aadikeshava : బుల్లితెరపై అదరగొడుతున్న వైష్ణవ్ తేజ్ మూవీ..

Whatsapp Image 2024 02 16 At 2.05.51 Pm

Whatsapp Image 2024 02 16 At 2.05.51 Pm

మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మరో కమర్షియల్ హిట్టు కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాడు.ఆదికేశవ మూవీతో వైష్ణవ్ కి ఈసారి బ్లాక్ బస్టర్ ఖాయమని అభిమానులు భావించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ మూవీ టీజర్స్‌ మరియు ట్రైలర్స్ ఆకట్టుకున్నాయి. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ మూవీ కథలో మార్పులు చేర్పులు చేయడంతో రిలీజ్‌కు ముందు అభిమానుల్లో అంచనాలు రేకెత్తించింది. కానీ అవుట్‌డేటెడ్ స్టోరీ లైన్ కారణంగా మొదటి ఆట నుంచే ఈ సినిమా నెగెటివ్ టాక్‌ను మూటగట్టుకున్నది. ఫస్ట్ వీకెండ్‌లోనే ఈ మూవీ థియేటర్లలో కనిపించకుండాపోయింది. ఈ మూవీ ఫుల్ థియేట్రికల్ రన్‌లో కేవలం మూడు కోట్ల వరకు మాత్రమే వసూళ్లను రాబట్టింది. ఎనిమిదిన్నర కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ నిర్మాతలకు ఐదున్నర కోట్లకుపైగా నష్టాలను మిగిల్చింది.

థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఆదికేశవ మూవీ రిలీజైంది. అక్కడ కూడా ఈమూవీకి థియేటర్ రిజల్ట్ ఎదురైంది. ఓటీటీ ఆడియెన్స్ ఆదికేశవపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. అయితే ఇటీవలే ఆదికేశవ మూవీ బుల్లితెరపైకి వచ్చింది. స్టార్‌మా ఛానెల్‌లో ఈ మూవీ టెలికాస్ట్ అయ్యింది. ఈ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి ప్రేక్షకుల నుంచి చక్కటి రెస్పాన్స్ వచ్చింది.ఈ మూవీ ఏకంగా 10.47 టీఆర్‌పీ రేటింగ్‌ను దక్కించుకున్నది. ఉప్పెన తర్వాత వైష్ణవ్‌తేజ్ కెరీర్‌లో హయ్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్ దక్కించుకున్న మూవీగా నిలిచింది. ఆదికేశవ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆదికేశవ మూవీలో మలయాళ అగ్ర నటుడు జోజు జార్జ్ విలన్‌గా నటించాడు. ఈ మూవీలో అపర్ణాదాస్ కీలక పాత్ర పోషించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి దర్శకుడు త్రివిక్రమ్ ఈ మూవీని నిర్మించారు.

Exit mobile version