Sachin-Vaibhav: నాడు సచిన్ vs ఖదీర్.. నేడు వైభవ్ vs బుమ్రా..1989లో భారత్, పాకిస్థాన్ మాచ్ సీన్ రిపీట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sachin-Vaibhav: ఐపీఎల్‌లో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్య వంశీ కుమ్మేస్తున్నాడు. నిన్న జరిగిన రాజస్థాన్ రాయల్స్(RR), ముంబై ఇండియన్స్ (MI) మ్యాచ్‌లో వైభవ్ మారోసారి రెచ్చిపోయాడు. ఈ సారి మాత్రం ఈ యువ విధ్వంసకర ప్లేయర్ ప్రపంచ స్థాయి బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ను ఏమాత్రం భయపడకుండా ఎదుర్కొన్నాడు. యార్కర్ కింగ్ ఓవర్‌లో వరుస సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. బుమ్రా యార్కర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ, పవర్ ప్లేలో భారీ సిక్సర్లు కొట్టాడు. 15 ఏళ్ల వయస్సులోనే, ప్రపంచంలోనే అత్యుత్తమ పేసర్‌పై వైభవ్ చూపిన ధైర్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది కేవలం బౌలింగ్ వర్సెస్ బ్యాటింగ్ కాకుండా, అనుభవానికి, యువ ప్రతిభకు మధ్య జరిగిన పోరులా సాగింది. ఈ మ్యాచ్‌లో క్రికెట్ ప్రియులను 1989లోకి తీసుకెళ్లింది. అప్పట్లో జరిగిన భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ పాకిస్థాన్ స్పిన్నర్ అబ్దుల్ ఖరీర్ ఓవర్‌లో చెలరేగిన తీరును గుర్తు చేసింది.
READ MORE: Bellamkonda Srinivas: కాబోయే భార్య ‘కావ్య’పై..శ్రీనివాస్ ఎమోషనల్ పోస్ట్!
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
ఒక్క క్షణం ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తే.. సరిగ్గా 37 ఏళ్ల క్రితం 1989లో పెషావర్‌లో ఏం జరిగిందో అదే సీన్ గౌహతిలో రిపీట్ అయినట్లు అనిపించింది. అప్పుడు లెజెండరీ స్పిన్నర్ అబ్దుల్ ఖాదిర్ బౌలింగ్‌లో 16 ఏళ్ల సచిన్ టెండూల్కర్ ఒకే ఓవర్‌లో నాలుగు సిక్సర్లు బాది ప్రపంచానికి తన రాకను చాటాడు. నాడు ఖాదిర్ ఒక ప్లాన్ ప్రకారమే సచిన్‌ను ఊరించినా, సచిన్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా విరుచుకుపడ్డాడు. సరిగ్గా అలాంటి అద్భుతమే ఇప్పుడు 2026 ఐపీఎల్‌లో చోటుచేసుకుంది. నిన్నటి మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఎదురుగా ఉన్నది సాదాసీదా బౌలర్ కాదు.. 145 కిలోమీటర్ల వేగంతో యార్కర్లు వేసే డెత్ ఓవర్ల కింగ్ బుమ్రా. సాధారణంగా బుమ్రా పేరు వింటేనే బ్యాటర్లు ఒత్తిడికి లోనవుతారు. కానీ వైభవ్ మాత్రం బుమ్రాను నెట్ బౌలర్‌లా చూశాడు. బుమ్రా వేసిన లెంగ్త్ బాల్‌ను ఏమాత్రం తడబడకుండా లాంగ్-ఆన్‌పై సిక్సర్‌గా మలిచాడు. స్టేడియం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. బుమ్రా ముఖంలో ఒక వింత నవ్వు.. బహుశా నాడు ఖాదిర్ కూడా సచిన్ బ్యాటింగ్ చూసి అలాగే నవ్వుకుని ఉంటాడు.
తాజావార్తలు
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!